ఇర్ఫాన్ ఖాన్ మృతికి బాలీవుడ్ సంతాపం.. Irrfan Khan
2020-04-29 21:48:34

జాతీయ ఉత్తమ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం అభిమానులను కలిచి వేస్తుంది. ఈయన లేడన్న వార్త తెలియగానే ఫ్యాన్స్ అంతా షాక్ లోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ అయితే ఇది నమ్మలేక పోతున్నారు. ఇర్ఫాన్ లేడన్న వార్త అబద్ధం అయితే బాగున్ను అంటున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అరుదైన క్యాన్సర్ ను కూడా జయించి వచ్చిన ఇర్పాన్.. ఇలా ఉన్నట్లుండి అనారోగ్యం పాలు కావడం.. రెండు రోజుల్లోనే చనిపోవడం అనేది ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్ నటులు ఒక్కొక్కరుగా ఈ చేదు నిజాన్ని తెలుసుకుని తమ సంతాపం తెలియచేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఇప్పటికే ఈ వార్తపై స్పందించాడు. అజయ్ దేవ్ గన్ కూడా ఇర్ఫాన్ ఆకస్మిక మరణం జీర్ణించుకోలేదని ట్వీట్ చేసాడు. సోనమ్ కపూర్, కరణ్ జోహార్ లాంటి వాళ్లు కూడా ఇర్ఫాన్ మృతిపై స్పందించారు. సంతాపం తెలియచేసారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. ట్విట్టర్ అంతా ఇప్పుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం చుట్టూనే తిరుగుతుంది. అంతా ఆయనకు సంతాపం తెలియచేస్తున్నారు. 

More Related Stories