లారెన్స్ మరో సాయం.. గర్భిణికి అండదండలు..raghava
2020-05-03 15:28:14

సినిమాల్లోనే కాదు బయట కూడా తాను హీరో అనిపించుకుంటున్నాడు లారెన్స్. ఎప్పుడు ఎవరికి ఏ సాయం కావాలని తనను అడిగినా.. తన ఇంటి తలుపు తట్టినా కూడా కాదనకుండా సాయం చేస్తూనే ఉంటాడు ఈయన. మొన్న కూడా కరోనా క్రైసిస్ కోసం ఏకంగా 3 కోట్లు ఇచ్చి ఔరా అనిపించాడు లారెన్స్. ఇప్పుడు కూడా ఇలాంటి పనే చేసాడు. కష్టాల్లో ఉన్నాను.. మీరే ఆదుకోవాలి అంటూ ఓ వ్యక్తి నుంచి లారెన్స్ కు ఫోన్ వచ్చింది. అదెక్కడి నుంచి కూడా అని కూడా చెక్ చేసుకోలేదు లారెన్స్.. ముందు వాళ్లకు సాయపడతానని మాటిచ్చాడు. ఆ తర్వాత సమస్య కనుక్కున్నాడు. తన భార్యకు కరోనా టైంలో డెలివరీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. ఆస్పత్రులు ఓపెన్ లేవని.. ఆమె గర్భిణీ స్త్రీ అని మీరే సాయం చేయాలని కోరాడు ఆ వ్యక్తి. అంతే లారెన్స్ సహాయం చేశాడు. వెంటనే తమిళనాడు ఆరోగ్య మంత్రి పీఏకి సమాచారం ఇచ్చాడు లారెన్స్.. దాంతో అతను గర్భిణీ స్త్రీని కేఎంసీ ఆసుపత్రిలో చేర్పించాడు.. డెలివరీ తర్వాత లారెన్స్ తన ఫేస్ బుక్ లో డెలివరీకి సాయం చేసిన వైద్యులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తల్లి బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని రాసుకొచ్చాడు లారెన్స్. చిన్నారి ఆరోగ్యంగా ఉందని.. తల్లి చికిత్సలో ఉందని చెప్పాడు. దీంతో సోషల్ మీడియాలో లారెన్స్ ను నువ్వు దేవుడు సామి అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

More Related Stories