ఆచార్య నుండి కాజల్ ఎగ్జిట్ మీద క్లారిటీ !kajal
2020-05-03 11:33:07

మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న తాజా మూవీ ఆచార్య. కరోనా వలన ఏర్పడిన లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పటికే ఈ సినిమా సుమారు 70 శాతం షూటింగ్ పూర్తయిందని అంటున్నారు. అయితే మొన్నటి దాకా ఈ సినిమాలో చిరు సరసన ఎవరు నటిస్తారు అనే విషయం మీద అభిమానుల్లో అమితాసక్తి నెలకొనగా.. అనుష్క, కాజల్‌, నయనతార, త్రిష ఇలా చాలా మంది పేర్లు పరిశీలించాక ఫైనల్‌గా త్రిషనే తీసుకున్నారు. స్టాలిన్ లో అలరించిన ఈ కాంబో అనగానే మెగాభిమానులు సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు, ఎందుకంటే ఈ సినిమాలో తాను నటించడం లేదని తాను ఈ సినిమా నుండు వైదొలుగుతున్నట్లు ట్విట్టర్ వేదికగా సడన్ షాకిచ్చింది. ఆ తర్వాత త్రిష స్థానంలో కాజల్‌ను తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావించారని వార్తలు వచ్చాయి. యూనిట్ నుండి అధికారిక ప్రకటన రాలేదు కానీ తాను కాజలే తాను ఈ సినిమాలో నటిస్తునానని చెప్పుకుంది.

ఆమె ఇప్పటికే చిరు సరసన ఖైదీ నంబర్-150లో నటించి మెప్పించింది కాబట్టి ఈ కాంబోలో ఇది రెండో సినిమా కావడంతో ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు మళ్ళీ యూనిట్ శాకిస్తూ ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు చెబుతున్నారు. అయితే ఆమె ఎందుకు తప్పుకుంది అనే దానికి రణాలు తెలియట్లేదు కానీ పుకార్లు మాత్రం షికార్లు చేస్తున్నాయి. కరోనాకు ముందు అడిగిన పారితోషికానికి తర్వాత చెబుతున్న పారితోషికానికి చాలా తేడా ఉందని అందుకే ఆమె తప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా కాజల్ తరపు నుండి ఈ విషయం మీద క్లారిటీ వచ్చింది. ఆమె సినిమా నుండి తప్పుకోబోతుందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని సినిమా కోసం ఆమె బల్క్‌ డేట్స్‌ ఇచ్చేసిందని అంటున్నారు. ఈ సినిమా కోసం ఆమె ఎంత గానో ఆసక్తిగా ఎదురు చూస్తోందని, షూట్ మొదలు కాగానే ఆమె సెట్స్‌లోకి అడుగుపెడుతుందని ఆమె సన్నిహిత వర్గాల నుండి సమాచారం అందుతోంది. 

More Related Stories