బ్రహ్మానందంలో ఈ కళ కూడా ఉందండోయ్..bhar
2020-05-04 13:38:13

బ్రహ్మానందం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది కామెడీ.. కానీ ఈయనలో కేవలం కామెడీ మాత్రమే కాదు ఇంకా చాలా కళలు కూడా ఉన్నాయి. మిమిక్రీతో పాటు కళారంగంపై కూడా చాలా ఆసక్తి చూపిస్తుంటాడు బ్రహ్మి. ఇప్పుడు కూడా కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన ఈ లెజెండరీ హాస్య నటుడు తనలోని చిత్ర కళకు పదును పెట్టాడు. ఈ మధ్య ఖాళీ సమయం బాగానే దొరకడంతో వరుసగా చిత్రాలు గీస్తున్నాడు బ్రహ్మానందం. ముఖ్యంగా ఈయనలోని కళను చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. నిజంగానే బ్రహ్మిలో ఇంత టాలెంట్ దాగుందా అంటున్నారు. బ్రహ్మానందంలో ఓ మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. ఆయనలోని ఈ కళా నైపుణ్యం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. తాజాగా కరోనా నియంత్రణ కోసం భారతీయుల పోరాట స్ఫూర్తి ప్రతిబింబించేలా ఆయన తన కళకు పని చెప్పారు.. అందులోనే ప్రస్తుత పరిస్థితులు ప్రతిబింబించేలా అద్భుతమైన శిల్పాన్ని చెక్కేందుకు ప్రయత్నించాడు బ్రహ్మానందం.

భారత్ లాక్ డౌన్ అనే విధానంతో కరోనా వైరస్ కే భయం తెప్పిస్తున్నట్లు చూపించటం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ స్కెచ్ బ్రహ్మానందం కుమారుడు హీరో గౌతమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఆయన వేసిన స్కెచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రహ్మానందంలో ఉన్న ఈ కళను చూసి అంతా మీకు సలాం సర్ అంటున్నారు. ఇప్పటికే ఈయన లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న సినిమా కార్మికుల కోసం చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి 3 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు బ్రహ్మానందం. ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తండ సినిమాలో నటిస్తున్నాడు బ్రహ్మానందం. అయితే ఇందులో సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు ఈయన.

More Related Stories