నేను అలాంటి వీడియోలకు దూరం అంటున్న పూజా హెగ్డే..pooja
2020-05-04 13:49:07

లాక్ డౌన్‌లో ఇంట్లో ఖాళీగా తిని కూర్చోకుండా ఏదో ఓ పని చేయాలని చూస్తున్నారు మన సెలబ్రిటీస్. ప్రస్తుతం అదే పని మీద అంతా బిజీగా ఉన్నారు. అందులో ముఖ్యంగా కొందరు హీరోయిన్లు అయితే పొద్దున్నే లేచిన కాన్నుంచి పడుకునే వరకు వర్కవుట్ వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. దాంతో కొందరికి చూస్తుంటేనే ఒళ్లు మండిపోతుంది. ఇష్టమొచ్చినట్లు అలా జిమ్ వర్కవుట్స్ పేరుతో వయ్యారాలను ఒడ్డించకపోతే కాస్త పనికొచ్చే వీడియోలు పెట్టొచ్చుగా అంటున్నారు నెటిజన్లు. బయట సాధారణ జనం అన్ని ఇబ్బందులు పడుతుంటే మీకు మాత్రం సాయం చేయాలని ఉండదా అంటూ రివర్స్ లో వీడియోలు పెట్టిన వాళ్లకు విమర్శలు కూడా వస్తున్నాయి. దాంతో పూజా హెగ్డే ఈ విషయాన్ని ముందుగానే గ్రహించినట్లుంది.

అందుకే అలాంటి వీడియోల జోలికి అస్సలు వెళ్లడం లేదు. ఏదో ఇంట్లో ఉన్నపుడు ఎలాగూ నిక్కరులోనే ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడూ చూస్కోండి అంటూ కొన్ని హాట్ పోటోలను మాత్రం షేర్ చేస్తూ తానున్నానని గుర్తు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకానీ తాను మాత్రం ఆ కసరత్తుల జోలికి.. వీడియోల జోలికి.. లైవ్ లో ఎక్సర్ సైజులు చేయడాలు చేయనని చెబుతుంది పూజా. ఫిట్ నెస్ విషయంలో తానేమీ ఎక్స్ పర్ట్ కాదని చెబుతుంది ఈమె. ఏదో ఒక ఫిట్ నెస్ అందుకే ఏం పెట్టాలనుకోవడం లేదు.. అయినా సోషల్ మీడియాలోనే బోలెడున్నాయి కదా అంటుంది ఈమె. ఏదేమైనా కూడా రియల్ సిచ్చువేషన్స్ తొందరగానే అర్థం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్, అఖిల్ సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ.

More Related Stories