లూసిఫర్ రీమేక్ లో చిరంజీవి బంటుగా సల్మాన్  Salman Khan
2020-05-04 21:15:50

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా మీద భారీ ఆంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ఎందుకో కానీ బాగా లేతయిందని చెప్పచ్చు. అందుకేనేమో ఇది పూర్తి అవగానే చేయడానికి ఇప్పటి నుండే వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఆయన ముగ్గురు దర్శకులను తన నెక్స్ట్ మూవీ కొరకు లైన్ లో పెట్టారు. మెహర్ రమేష్, బాబీ అలాగే సుజీత్ తో కథా చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు కూడా. సుజీత్ కి ఆయన మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ బాధ్యతలు అప్పగించారు. ఆ స్క్రిప్ట్ పై ప్రస్తుతం సుజీత్ పని చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు బయట కొచ్చాయి. 

తెలుగు వర్షన్‌లో చిరుకు హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేశారని ప్రచారం జరిగింది. ఇప్పటికే తెలుగు వెర్షన్ స్క్రిప్ట్‌లో సుకుమార్‌తో పాటు కొంత మంది రైటర్స్ మార్పులు చేర్పులు చేశారు. ఆ మార్పులన్నీ కలిపి దీనిని పూర్తి స్థాయి తెలుగు సినిమాగా తీర్చి దిద్దే పనిలో పడ్డాడట సుజీత్. నిజానికి ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ లో మోహన్ లాల్ నటించారు. ఆ సినిమాలో ఆయన రోల్ నే ఇప్పుడు చిరు పోషిస్తున్నారు. ఇక మోహన్ లాల్ నమ్మిన బంటుగా ఉండే ఒక పాత్రను పృథ్వీరాజ్ పోషించారు. ఈ క్రమంలోనే తెలుగు వర్షన్‌లో పృథ్వీరాజ్ పోషించిన ఆ పాత్రను సల్మాన్ ఖాన్ చేత చేయించాలని చూస్తున్నారట చరణ్. 

నిజానికి చిరంజీవి రీ ఎంట్రీ మూవీలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేయాలని అనుకున్నారని ఆ సమయంలో అది కుదరకపోవడంతో లూసిఫెర్ తెలుగు రీమేక్ లో సల్మాన్‌ని భాగం చేయాలని చిరంజీవి  యోచిస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి సైరాలో  ఆయన గురువుగా బిగ్ బీ  అమితాబ్ బచ్చన్ నటించారు. మరి లూసిఫర్ రీమేక్ లో సల్మాన్ ఖాన్ నటిస్తే చిరంజీవి చిత్రాల్లో బాలీవుడ్ నటులు ఇకపై కూడ కొనసాగే అవకాశం ఉండచ్చని అంటున్నారు. అయితే ఇది పుకారో లేక నిజమైన వార్తో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే. 

More Related Stories