నారా రోహిత్ మార్పుకు కారణం ఇదే..rohit
2020-05-06 02:40:17

ఒకప్పుడు ఏడాదికి అరడజన్ సినిమాలు చేసాడు నారా రోహిత్. ఓ టైమ్ లో ఈయన ఎన్ని సినిమాలు చేస్తున్నాడనేది తెలుసుకోవడం కూడా కష్టంగానే ఉండేది. అంత బిజీగా ఉండే హీరో ఒక్కసారిగా కొన్ని రోజులుగా కనిపించడం లేదు. కనీసం బయటికి కూడా రావట్లేదు.. లాక్‌డౌన్‌లో బయటికి ఎలా వస్తాడనుకోవద్దు.. సోషల్ మీడియాలో అన్నమాట. అయితే అప్పట్లో లావుగా చబ్బీ చబ్బీగా ఉండే నారా రోహిత్ ఇప్పుడు మాత్రం పూర్తిగా మేకోవర్ అయిపోయాడు. ఈయన లుక్ చూసి అంతా షాక్ అవుతున్నారు.

రోహిత్ న్యూ లుక్‌కి ఫిదా అవుతున్నారంతా. ప్రస్తుతం ఈయన తన కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి నెటిజన్స్ ఆశ్చర్య పరిచాడు. ఈ లుక్ కొత్త సినిమా కోసమే అనే ప్రచారం జరుగుతున్న వేళ ఈయన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఇదివరకు తన బాడీ తనకు నచ్చేది కాదని.. అందుకే ఒక సంవత్సరం పాటు సినిమాలు చేయకుండా పూర్తిగా వర్కవుట్స్ చేసానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా జిమ్ మూత పడటంతో ఇంట్లోనే కార్డియో ఎక్సర్‌సైజులు చేస్తున్నట్లు చెప్పాడు నారా రోహిత్. తక్కువ కార్బొహైడ్రేట్స్ ఫుడ్ తీసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు ఈయన. తన కొత్త సినిమా ముచ్చట్లను త్వరలోనే చెప్తానంటున్నాడు ఈ నారా వారబ్బాయి.

More Related Stories