పవన్ కళ్యాణ్ కోసం మెట్టు దిగుతున్న త్రివిక్రమ్.. Trivikram pawan
2020-05-07 00:40:01

తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత ఆ స్థానం కోసం పోటీ పడుతున్న వాళ్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుంటాడు. చాలా ఈజీగా ఇండస్ట్రీ హిట్స్ ఇస్తుంటాడు ఈ దర్శకుడు. అత్తారింటికి దారేదితో పాటు అప్పట్లో జల్సా.. మొన్నటికి మొన్న అల వైకుంఠపురములో సినిమాలతో సంచలనాలు సృష్టించాడు త్రివిక్రమ్. అందుకే ఈయనతో సినిమా అంటే ఎగిరి గంతేస్తారు హీరోలు. ఇప్పుడు ఈయన మరోసారి పవన్ కళ్యాణ్ సినిమాకు పని చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ ఇద్దరూ ఎంత మంది స్నేహితులు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు పవన్.

వకీల్ సాబ్.. క్రిష్.. హరీష్ శంకర్ సినిమాలు లైన్ లోనే ఉన్నాయి. ఈ మూడు పూర్తైన తర్వాత డాలి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు పవన్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గోపాల గోపాల, కాటమ రాయుడు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మూడోసారి అవకాశం ఇచ్చాడు పవన్. అయితే ఈ సినిమాకు కథ, మాటలు రాయాల్సిందిగా పవన్ స్వయంగా త్రివిక్రమ్ ను అడిగాడని తెలుస్తుంది. దీనికి ఈయన కూడా ఓకే అన్నాడని ప్రచారం జరుగుతుంది. గతంలో దర్శకుడిగా మారిన తర్వాత కూడా పవన్ కోసమే జయంత్ సి.పరాన్జీ తెరకెక్కించిన తీన్ మార్ సినిమాకి త్రివిక్రమ్ మాటలు అందించాడు. ఈయన దర్శకుడిగా మారిన తర్వాత మరో సినిమాకు ఇలా ఎప్పుడూ చేయలేదు. నితిన్ ఛల్ మోహన్ రంగాకు లైన్ మాత్రం ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి పవన్ కోసం పెన్ పడుతున్నాడు మాటల మాంత్రికుడు. 

More Related Stories