నితిన్ సినిమాలో మరో హీరో..ఎవరంటే Satya dev
2020-05-07 12:49:16

ప్రస్తుతం రెండు మూడు సినిమాలు ఒప్పుకుని నటిస్తూ బిజీగా ఉన్నాడు నితిన్‌. మొన్ననే భీష్మ హిట్ కొట్టిన ఆయన పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ కరోనా కాటు వేయడంతో అది కూడా వాయిదా పడింది. ఇక ఆయన చేస్తున్న తదుపరి సినిమా `రంగ్ దే`. ఇక ఇది కాక ఛ‌ల్ మోహ‌న రంగ‌` త‌రువాత నితిన్, ద‌ర్శకుడు కృష్ణ చైత‌న్య కాంబినేష‌న్‌లో ‘ప‌వ‌ర్ పేట’ పేరుతో మ‌రో చిత్రం రాబోతోంది. ఈ సినిమాలోనే కీర్తి సురేష్ హీరోయిన్‌గా క‌న్‌ఫ‌ర్మ్ అయింద‌ని తెలిసింది. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘వడ చెన్నై’ తరహాలోనే ఈ సినిమా రూపొందనుంద‌ని టాక్. అంతేకాక ఏకంగా ఈ సినిమా రెండు భాగాలుగా తెర‌కెక్కనుంద‌ని కూడా అంటున్నారు. ఇక ఈ సినిమాలో విలన్‌గా రావు రమేష్ నటించనున్నాడని అంటున్నారు. ఆ విషయాలు పక్కన పెడితే ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నట్టు చెబుతున్నారు. 

అయితే ఈ సినిమాలో మ‌రో యంగ్ హీరోకి కూడా చోటు దక్కినట్టు తెలుస్తుంది. ఆయన ఎవరో కాదు స‌త్యదేవ్. పవర్ పేట సినిమలో సత్య దేవ్ కు ఓ కీల‌క‌మైన పాత్రలో నటించే అవకాశం దక్కిందట. స‌త్య‌దేవ్ పాత్ర నితిన్‌తో పాటు స‌మానంగా ఉంటుంద‌ని, ఈ క‌థ‌ని మ‌లుపు తిప్పడంలో కీల‌కమవుతుంద‌ని అంటున్నారు. ఇక పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించబోయే పవర్ పేట రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ వేసవిలో ప్రారంభం కావాల్సి ఉంది. నిజానికి ఈ సినిమాని ముందు నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్‌లో నిర్మించాల‌నుకున్నారు. అయితే ఏమయిందో ఏమో ఆ ప్రాజెక్ట్ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ వ‌ద్దకు వెళ్లింది. అక్కడి నుండి ప‌వ‌ర్‌పేట‌ చేతులు మారి పీపుల్ మీడియా వారి ద‌గ్గరికి చేరింది. 

More Related Stories