బోల్డ్ పాత్రలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హనీ పాప ?mehran
2020-05-08 02:37:37

ఈ మధ్య కాలంలో ఒక టాక్ బాగా వినిపిస్తోంది. అదేంటంటే భవిషత్తులో సినిమాలు మాయం అవ్వచ్చని ? సినిమాల్ని వెబ్ సిరీస్ లు రీప్లేస్ చేయచ్చనే వాదన వినిపిస్తోంది. ఈ వాదనకు తగ్గట్టే చాలా మంది స్టార్స్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాటిలో భాగం అవుతున్నారు. అయితే పెద్ద పెద్ద పండగలకు కొత్త సినిమాలు వేసుకుని వాటి ద్వారా టీఆర్పీలు పెంచుకునేవి టీవీ ఛానల్స్. కానీ ఈ మధ్య కాలంలో వెబ్‌ సిరీస్‌ లు లెక్కకు మించి నిర్మితం అవుతున్నాయి. ఒక్క సిరీస్ సక్సెస్‌ కావడం ఆలస్యం ఎంతనే వాటికి సీక్వెల్స్‌ అంటూ వరుసగా సిరీస్ లు వస్తున్నాయి. మొన్నటి వరకు ఇతర దేశాలకే పరిమితం అయిన వెబ్‌ సిరీస్‌ లు గత కొంత కాలంగా ఇండియాలో కూడా విస్తరిస్తున్నాయి. వెబ్‌ సిరీస్‌ లను కూడా సినిమాల స్థాయిలో సినిమా నటీనటులను, టెక్నీషియన్స్ ని పెట్టి మరీ తీస్తున్నారు.

నిజానికి సినిమాలకు అయితే కొన్ని పరిమితులు, సెన్సార్‌ లాంటి కండీషన్స్‌ ఉంటాయి. వెబ్‌ సిరీస్‌ లకు అలాంటివి ఏమీ లేని కారణంగా చాలా మంది వెబ్‌ సిరీస్‌ లపై ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో సినిమాల కంటే వెబ్‌ సిరీస్‌ లకే అధిక ప్రాముఖ్యత ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ సిరీస్ లు ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితం కాగా నెమ్మదిగా తెలుగులో కూడా ఈ సిరీస్ నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. ఎఫ్ 2 తర్వాత మెహ్రీన్ కు వరుసగా ఆఫర్లు క్యూకట్టాయి. అయితే ఈ బ్యూటీ నటించిన చాణక్య, ఎంతమంచి వాడవురా.. అశ్వద్ధామ వరుసగా ఫ్లాప్ కావడంతో బాలీవుడ్ లో వెబ్ సిరీస్ నటించేందుకు ప్లాన్ చేసుకుంటుందని చెబుతున్నారు. హాట్ హాట్ వెబ్ సిరీసుల్లో బోల్డ్ సీన్స్ లో కూడా తాను నటించేందుకు రెడీ అన్నట్టు మేహ్రీన్ సిగ్నల్స్ ఇస్తోందని అంటున్నారు.

ఇప్పటికే మెహ్రీన్ తమ్ముడు గుర్ఫతే సింగ్ గిల్టీ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఆ పాపులారిటీతోనే గుర్ఫతే.. తన అక్క మెహ్రీన్ కి ఓ వెబ్ సిరీస్ లో అవకాశం ఇప్పించినట్టు టాక్ నడుస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమయ్యే ఒక వెబ్ సిరీస్ కోసం ఆమెను సంప్రదించారట. మరి ఆ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ ఎలా కనిపిస్తుందో బీటౌన్ జనాలను ఆకట్టుకుకో గలుగుతుందో చూడాలి. 

More Related Stories