బోల్డ్ పాత్రలకు సిద్ధమే అంటున్న భూమిక చావ్లా.. Bhumika Chawla
2020-05-08 12:15:55

భూమిక‌.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ఒక‌ప్పుడు ప‌వ‌న్ హీరోయిన్ గా తెలుగులో భూమిక‌కు చాలా క్రేజ్ ఉండేది. ఖుషీ సినిమాతో ఈమె సృష్టించిన సంచ‌ల‌నం అలాంటిది మ‌రి. ఆ త‌ర్వాత చాలా మంది స్టార్ హీరోల‌తో న‌టించింది భూమిక. చిరు నుంచి అల్ల‌రి న‌రేష్ వ‌ర‌కు అంద‌రితోనూ న‌టించింది. యోగా గురువు భ‌ర‌త్ ఠాకూర్ ను పెళ్ళి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది భూమిక‌. ఆర్థికంగా కూడా భూమిక ప‌రిస్థితి పెద్ద‌గా చెప్పుకోడానికి ఏమీ లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దాంతో ఈ మ‌ధ్యే మ‌ళ్లీ సినిమాల వైపు వ‌చ్చింది ఈ భామ‌. మూడేళ్ల కింద ధోనీ సినిమాలో ఎమ్మెస్ ధోనీకి అక్క పాత్ర‌లో న‌టించిన భూమిక‌.. ఆ మ‌ధ్య ఎంసిఏలో నానికి వ‌దిన‌గా న‌టించింది. ఈ సినిమాలో భూమిక పాత్ర ప్రాణం. భూమిక కూడా ఈ పాత్ర‌కు తాను త‌ప్ప మరొక‌రు సూట్ కార‌నే రేంజ్ లో రెచ్చిపోయింది. దాంతో ఇప్పుడు ఈమెకు తెలుగులో ఆఫ‌ర్లు పెరిగిపోతున్నాయి. 

నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచిలోనూ భూమిక ప్ర‌ధాన పాత్ర పోషించింది. ఇదిలా ఉండ‌గానే ఇప్పుడు హాట్ ఫోటోషూట్ చేసి అంద‌రికీ షాక్ ఇచ్చింది భూమిక‌. అస‌లు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. వ‌య‌సు 40కి చేరువ‌వుతుంటే ఇప్పుడు ఇలా రెచ్చిపోవ‌డం ఏంటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. అంతేకాదు తాను బోల్డుగా నటించడానికి కూడా సిద్ధమే అంటుంది భూమిక. ఎలాంటి పాత్రలైనా చేయడానికి రెడీ అంటూ హింట్స్ ఇస్తుంది ఖుషీ హీరోయిన్. మొత్తానికి ఈ హాట్ నెస్ తో సంచ‌ల‌నాలు చేస్తుంది ఒక్కడు హీరోయిన్.

More Related Stories