పెళ్లి వద్దంటోన్న అందమైన నటిsithara
2020-05-09 03:14:39

టాలీవుడ్ లో టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సితార ఒకరు. వెండితెరపై హీరోలకు తల్లిగా నటించే ఈమెకు ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే ఈ విషయం మీద ఆమె స్పందిస్తూ తనకు పెళ్లి మీద ఆసక్తి లేదని అంటోంది. ఎప్పుడైతే తన జీవితంలో ఓ ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానో అప్పట్నుంచి పెళ్లిపై ఆలోచన పోయిందని ఆమె చెబుతోంది. ఆ ముఖ్యమైన వ్యక్తి మరెవరో కాదు ఆమె తండ్రి అని ఆమె చెప్పుకొచ్చింది. తన తండ్రి అంటే తనకు చాలా ఇష్టమని, ఇద్దరం ఫ్రెండ్స్ లా ఉండేవారమని ఆమె చెప్పుకొచ్చింది. ప్రతి విషయాన్ని తండ్రితో షేర్ చేసుకునే ఆమె అలాంటి తండ్రి అకాల మరణంతో క్రుంగిపోయానని చెప్పుకొచ్చింది. ఆ తరువాత పెళ్లిపై అస్సలు ఆలోచించలేకపోయానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తనకు తెలియదన్న ఆమె, ఒక వేళ పెళ్లి చేసుకున్నా అందులో ఆశ్చర్యపడ్డానికేం లేదని చెబుతోంది. ఆమెకు 47 ఏళ్ల వచ్చినా ఇప్పటికి పెళ్లి కాకపోవడంతో ఇప్పుడు చేసుకున్నా చేసుకోకున్నా ఒక్కటే అని ఆమె వేదాంతం చెబుతోంది. 

More Related Stories