సాయి పల్లవికి విరాటపర్వం టీమ్ విషెస్ Virata Parvam
2020-05-09 11:37:33

యంగ్ హీరో రానా, సాయి పల్లవి హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా విరాటపర్వం. నీది నాది ఒకే కథ సినిమా ఫేం దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నక్సలైట్ ఉద్యమం నేపథ్యంతో 1990ల నాటి కాలానికి సంబంధించిన కథతో తెరకెక్కుతోందని చెబుతున్నారు. ఈ మధ్య సినిమా షూటింగ్ కరోనా వలన బ్రేక్ పడింది. కానీ దాదాపు చాలావరకూ షూట్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా సాయి పల్లవి నక్సలైట్ గా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో తన పాత్రలో ఈజ్ కోసం రానా రిటైర్డ్‌ పోలీస్‌ ఉన్నతాధికారి దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకునున్నాడని కూడా ప్రచారం జరిగింది.

సాయి పల్లవి పాత్ర ఏమో జానపద గీతాలు పాడుతూ ప్రజలను చైతన్య పరిచే యువతిగా ఉంటుందట. ఇక భువనగిరిలో అత్యంత దారుణ హత్య కు గురైన బెల్లి లలిత పాత్రని పోలిన పాత్రలో ప్రియమణి నటిస్తోందని అంటున్నారు. ఇక ఈరోజు హీరోయిన్ సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా ఆమె లుక్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. వెనుక అమరావీరులకి జోహార్ అని ఒక పైలాన్ కి ముందు ఆమె బ్యాగ్ తీసుకుని కూర్చున్న స్టిల్ ని విద్దుదల చేసింది యూనిట్. ఈ “విరాట పర్వం" మీ నటనా ప్రస్థానంలో ఒక అద్భుతమైన పర్వంగా నిలవాలని కోరుకుంటూ సాయి పల్లవికి టీమ్ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

More Related Stories