పుష్పలో రష్మిక స్పెషల్ లుక్ Rashmika Mandanna
2020-05-09 19:25:05

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో పుష్ప అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ‌న్నీ లారీ డ్రైవర్ అని ముందు నుండి ప్రచారం జరిగింది. అయితే గంధపు చెక్కల స్మగ్లర్‌ గా కనిపించనున్నాడని పుష్ప సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమాని బన్నీ కెరీర్ లో మొదటిసారిగా తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో అంటే ప్యాన్ ఇండియా మూవీగా విడుదల చేయ‌నున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న నేప‌థ్యంలో సౌత్‌, నార్త్ ఇండ‌స్ట్రీకి సంబంధించి ప‌లువురు ప్రముఖుల‌ని ఎంపిక చేశారని అంటున్నారు. ఈ సినిమా నుండి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తప్పుకున్నారని ఆయన ప్లేస్ లో బాబీ సింహాని తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. 

ఈ విషయం మీద యూనిట్ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన లేదు కానీ ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అంశం బయటకొచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక ఒక స్పెషల్ లుక్ లో కనిపించనుందని అంటున్నారు. రష్మిక మేకప్, అలాగే లుక్ డిఫరెంట్ గా ఉండేలా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటివరకు పక్కింటి అమ్మాయి, కాలేజ్ పిల్ల పాత్రలలో నటించిన రష్మిక పుష్పలో సాలిడ్ ట్విస్ట్స్ తో కూడిన ఒక మాస్ లుక్ ఉన్న పాత్రలో నటిస్తారని అంటున్నారు. ఇక షూటింగ్స్ ప్రారంభం అయిన తరువాత గ్యాప్ లేకుండా పుష్ప మూవీ చిత్రీకరణ జరపాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

More Related Stories