జగదేకవీరుడు సీక్వెల్ ప్రభాస్ చేస్తున్నాడా ఏంటి..?prabhas
2020-05-11 15:13:55

ఇప్పుడు ఈ అనుమానం ఎందుకొచ్చింది..? అయినా మరో హీరోతో కచ్చితంగా జగదేకవీరుడు సినిమా సీక్వెల్ చేస్తానని అశ్వీనీదత్ చెప్పిన తర్వాత కూడా ఈ అనుమానం ఎందుకొచ్చింది అనుకుంటున్నారా..? దీనికి కూడా ఓ కారణం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ వైజయంతి మూవీస్ లో ఓ సినిమా చేస్తున్నాడు. మహానటి లాంటి అద్భుతాన్ని చెక్కిన తర్వాత రెండేళ్లకు పైగానే కూర్చుని ప్రభాస్ కోసమే ఓ కథ సిద్ధం చేసాడు నాగ్ అశ్విన్. ఇది కచ్చితంగా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమా అవుతుందని చెప్పాడు ఈ కుర్ర దర్శకుడు. ఇప్పుడు ఈ చిత్ర స్టోరీ లైన్ ఒకటి బయటికొచ్చింది. ఇది విన్న తర్వాత కచ్చితంగా ఈ సినిమా ఏదో జగదేకవీరుడు అతిలోకసుందరిలా అనిపిస్తుందే అంటారు కచ్చితంగా. సోషియో ఫాంటసీ తరహాలోనే ఉండే ఈ కథలో హీరో ఈ భూమ్మీద ఏదైనా చేయగల సమర్థుడు. ఓ మానవుడు.. దేవకన్యకు పుట్టిన పిల్లాడే ఈ కథలో హీరో అని తెలుస్తుంది. ఈ భూమి మీద ఎలాంటి విన్యాసాలైనా చేయగలడు..

అలాంటి వ్యక్తి ఈ భూమ్మీదకు వచ్చి ఎలా బతుకుతాడు అనేది కథ. ఈ కాన్సెప్ట్ కాస్త పీకే మాదిరి.. మరికాస్త జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా మాదిరి అనిపిస్తుంది. ఎందుకంటే జగదేకవీరుడు చివర్లో ఇంద్రజ తన ఉంగరం తీసి సముద్రంలో పడేస్తుంది.. అది కాస్త చేప మింగుతుంది. అక్కడితో కథ ముగుస్తుంది.. ఆ తర్వాత రాజు, ఇంద్రజ పెళ్లి చేసుకుంటారు. వాళ్లిద్దరికీ పుట్టిన పిల్లాడే సీక్వెల్ అని తెలుస్తుంది. ఇప్పుడు ప్రభాస్ కథ కూడా అలాగే ఉంది. అందుకే చిరంజీవి సినిమా కథకు కొనసాగింపు అన్నట్టుగా ప్రేక్షకులకు అనుమానాలు వస్తున్నాయి. ప్రభాస్ ఇప్పటికే 'బాహుబలి' లాంటి ఫాంటసీలో చూసిన తర్వాత మరోసారి సూపర్ హీరోలా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఈ చిత్రాన్ని 300 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారు. అందరూ పాన్ ఇండియా అంటున్నప్పటికీ నాగ్ అశ్విన్ మాత్రం ఓ అంతర్జాతీయ స్థాయి చిత్రంగా మలచాలనే ఆలోచనలో ఉన్నాడు.

More Related Stories