యువదర్శకుడు ఆకస్మిక మృతి...మొన్ననే సినిమా రిలీజ్Jibit George
2020-05-11 17:07:21

ఈ మధ్య కాలంలో చిత్రసీమలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య బాలీవుడ్‌లో ఇద్ద‌రు లెజెండ్స్ క‌న్నుమూయ‌గా, వారి మ‌ర‌ణం మరువక ముందే ఒక ముప్పై ఏళ్ళ యువ దర్శకుడు కూడా కళ్ళు మూశారు. మలయాళ దర్శకుడు జిబిత్ జార్జ్(30) హఠాన్మరణం పాలయ్యారు. అంత చిన్న వ‌య‌స్సులో ఆయ‌న మృతి చెంద‌డాన్ని ఆయ‌న కుటుంబ స‌భ్యులే కాక మలయాళ ఇండ‌స్ట్రీ కూడా జీర్ణించుకోలేక‌పోతుంది. ఎందుకంటే ఆయన వర్ధమాన దర్శకుడు. ద‌ర్శ‌కుడిగా రాణించాల‌ని ఎన్నో క‌ల‌లు క‌న్న ఆయన తొలి చిత్రం కొజిప్పోర్ మూవీని లాక్‌డౌన్‌కు కొన్ని రోజుల ముందే అంటే మార్చ్ 6న విడుదల చేశారు. కానీ కేరళలో మార్చ్ 11 నుంచి లాక్‌డౌన్ విధించడంతో ఆ సినిమాని జనాలు పెద్దగా చూడలేదు. 

అందుకే ఈ సినిమాని లాక్‌డౌన్ పూర్త‌య్యాక ఈ సినిమాని మ‌ళ్ళీ విడుద‌ల చేసే ఆలోచ‌నలో నిర్మాత‌లు ఉన్నారు. ఇంతలోనే ఆ దర్శకుడికి నూరేళ్ళు నిండిపోయాయి. ఆయనకు మే 9 రాత్రి గుండెపోటు రావడంతో హుఠాహుఠిన హాస్పిటల్‌కు తరలించారు. జార్జ్‌కి ఛాతిలో నొప్పి వస్తున్నా కూడా ఆయన దాన్ని వయసు రీత్యా పట్టించుకోలేదు. అయితే సాయంత్రం ఆ నొప్పి ఎక్కువ కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. దీంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. ఆయన మరణంతో మలయాళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. 30 ఏళ్ల యువ దర్శకుడు ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.  

More Related Stories