దేవి శ్రీ ప్రసాద్ ఈజ్ బ్యాక్.. చేతిలో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ సినిమాలు..devi
2020-05-12 14:00:37

ఈ మధ్య కాలంలో దేవి శ్రీ ప్రసాద్ కాస్త జోరు తగ్గించాడు. మరోవైపు తమన్ రఫ్ ఆడిస్తున్నాడు. అల వైకుంఠపురంలో సినిమాతో తమన్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో దేవి శ్రీ కాస్త తగ్గాడు. అయితే ఇప్పుడు మళ్లీ దూకుడు చూపిస్తున్నాడు. ఇప్పటికే ఉప్పెనలో విడుదలైన ఒక పాట సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఈయన చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఫ్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. అన్ని భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నాడు సుకుమార్. దాంతో పాటే హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ విషయం తాజాగా హరీష్ శంకర్ తన ట్విట్టర్ లో అనౌన్స్ చేశాడు. ఒకేసారి రెండు భారీ ప్రాజెక్టులు రావడంతో దేవి మళ్ళీ లైన్ లోకి వచ్చాడు. ఈ రెండు సినిమాలు విజయం సాధిస్తే మరి కొన్నాళ్ళ పాటు దేవి శ్రీ  ప్రసాద్ కి తిరుగుండదు. మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా దేవికి ఆఫర్లు వస్తున్నాయి. ఎటు చూసుకున్న కూడా మళ్ళీ ఈయనకు మంచి రోజులు దగ్గరికి వచ్చాయి. పవన్ కళ్యాణ్ తో ఇప్పటికే జల్సా, గబ్బర్ సింగ్, సర్దార్, అత్తారింటికి దారేది లాంటి సినిమాలకు పని చేశాడు. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది.

More Related Stories