మంచి తల్లిని కావడమే లక్ష్యమంటున్న శ్రుతిShruti Hassan
2020-05-12 18:34:00

కరోనా వలన ఏర్పాడిన లాక్ డౌన్ వలన దాదాపు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ సమయంలో సెలబ్రిటీలు తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పలకరిస్తున్నారు. తాజాగా అలా తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించిన శ్రుతి హాసన్ పలు కీలక విషయాలు పంచుకున్నారు. తన తండ్రి కమలహాసన్‌ తనను ఎప్పుడూ తిట్టడం కానీ, అరవడం కానీ చేయలేదని ఆమె చెప్పుకొచ్చింది. మీ తండ్రి ఎప్పుడైనా మీకు పనిష్మెంట్ ఇచ్చారా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా దీనికి ఆమె సమాధానం చెబుతూ, తనను ఆయన ఎన్నడూ కొట్టలేదని, తన తండ్రి అలా చేయరని పేర్కొంది. ప్రతి దానికి ఆయన వద్ద ఓ లాజిక్‌, కారణం ఉంటాయని చెప్పుకొచ్చింది.

ఒకసారి తాను ఓ తప్పుచేస్తే  తన తండ్రి తనతో చాలా నిరాశ చెందానని మాత్రమే అన్నారని చెప్పింది.  అంతేకాక జీవితంలో తాను సాధించాల్సింది ఎంతో ఉందని ఆమె చెబుతోంది. తన జీవిత లక్ష్యాల గురించి మాట్లాడుతూ కేవలం నటిగానే కాక పాటలు, కవితలు రాయడం, సినీ నిర్మాణ రంగం పట్ల కూడా ఆసక్తి ఎక్కువగానే ఉందని చేపౌకొచ్చింది. నా జీవితంలో నేను సాధించాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయని దానికి చాలా సమయం కూడా ఉందని ఆమె పేర్కొంది. కానీ భవిష్యత్‌లో ఒక మంచి తల్లిని కావాలనుకుంటున్నదే తన అంతిమ లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చింది. మంచి తల్లిగా ఉండటం మహిళల జీవితాల్లో ఓ గొప్ప విజయమని తన అభిప్రాయమని శృతి పేర్కొంది.  

More Related Stories