తన ప్రేయసిని పరిచయం చేసిన రానా...ఎవరంటే Rana Daggubati
2020-05-13 00:30:57

టాలీవుడ్‌లో మోస్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ప్రభాస్‌ తో పాటు రానా కూడా లిస్ట్‌ లో ఉంటాడు. ప్రభాస్‌కు ఈ మధ్య పెళ్లి ప్రయత్నాలు మొదలు అయ్యాయని ఆయన పెద్దమ్మ చెప్పగా రానా మాత్రం తన పెళ్లి గురించి ఎక్కడా ఎప్పుడూ బయటపడలేదు. అయితే అనూహ్యంగా ఆయన తన ప్రేయసిని పరిచయం చేశారు. తన సోషల్ మీడియా అకౌంట్ లో తాను ఎస్ చెప్పింది అంటూ మిహీకా బజాజ్ అనే ఆమెతో కలిసి ఉన్న పిక్ ఒకటి రానా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కి ఇప్పటికే సమంతా, హన్సికా, ఉపాసన లాంటి వాళ్ళు విష్ చేస్తున్నారు. ఇక ఆమె ఎవరు అనే విషయానికి వస్తే ఆమె హైదరాబాద్ కి చెందిన ఒక ఈవెంట్ మేనేజర్. సొంతగా డ్యూ డ్రాప్ డిజైనర్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను ఏర్పాటు చేసిన ఆమె రెండు మూడేళ్ళ బట్టి ఆ రంగంలో దూసుకుపోతోంది. రానాకు ఈమె ఎక్కడ ఎవరి ద్వారా పరిచయమో తెలియదు కానీ సడన్ గా అనౌన్స్ చేసి షాకిచ్చాడు రానా. ఆ మధ్య త్రిషతో పెళ్లి అంటూ రకరకాల పుకార్లు రేగినా చివరికి ఎవరూ ఊహించని విధంగా ఆయన ఈ కొత్త పేరు తెర మీదకు తెచ్చాడు. 

More Related Stories