లాక్‌డౌన్ నిబంధనలతో నిర్మాత తనయుడి నిశ్చితార్థం..maharshi
2020-05-13 14:26:54

లాక్‌డౌన్ సమయంలో కొన్ని నిబంధనలను పాటిస్తూ శుభకార్యాలు చేసుకోవచ్చు అంటూ ఈ మధ్యే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాడు. దాంతో ఇప్పుడు ఒక్కొక్కటిగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న దిల్ రాజు చాలా నిరాడంబరంగా తన రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నిర్మాత వల్లూరిపల్లి రమేష్-గీత దంపతుల పెద్ద కుమారుడు రాఘవేంద్ర మహర్షి వివాహ నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లోని అత్తలూరి సాంబశివరావు-శ్రీదేవి దంపతుల కుమార్తె శ్రీజతో ఈయన కుమారుడి నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్ నిబంధనలకు లోబడి కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా ఈ నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా యూ ట్యూబ్ లైవ్ లో బంధుమిత్రులంతా వీక్షించి శుభాశీస్సులు అందించినట్లుగా నిర్మాత వల్లూరిపల్లి రమేష్ మీడియాకు తెలిపాడు. ఈయన ఇప్పుడు సినిమాలు చేయడం లేదు కానీ ఒకప్పుడు మాత్రం చిరంజీవితో 'మంచుపల్లకి'.. ఎన్టీఆర్‌తో 'అశోక్'.. కళ్యాణ్ రామ్ తో అసాధ్యుడు.. రవితేజతో 'ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' లాంటి చిత్రాలను వల్లూరిపల్లి రమేష్ నిర్మించారు.

More Related Stories