తన వెబ్ సిరీస్ ని చిరుకు అంకితం ఇచ్చిన ప్రియదర్శిchiru
2020-05-15 19:36:13

కమెడియన్‌ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పులికొండ ప్రియదర్శి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా కూడా మారాడు. విభిన్న పాత్రలు చేస్తూ నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. చాలా హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీ యాక్టర్‌గా మారిన ప్రియదర్శి హీరోగా ‘మల్లేశం’ సినిమా చేశాడు. ప్రస్తుతం ‘లూజర్’ అనే వెబ్ సిరీస్‌ లో ఆయన ఒక పాత్ర చేశారు. లాక్ డౌన్ కు ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న లూసర్ అనే వెబ్ సీరిస్ అన్ని పనులు పూర్తి చేసుకుని ఈరోజు నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ తో ప్రియదర్శి డిజిటల్ లో డెబ్యూ ఇచ్చాడు, ఈ సిరీస్ లో ప్రియదర్శి రైఫిల్ షూటర్ గా కనిపిస్తాడు. తల్లితండ్రులు లేని ఒక వీధి బాలుడు ఒక షూటర్ గా మారడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు అనే విషయం చుట్టూ ఈ వెబ్ సీరిస్ తిరగనుంది. 1980 నుంచి 2000 దాకా ఉండే మధ్యకాలంలో ఈ వెబ్ సీరిస్ జరగనుంది.

ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాకు మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ప్రియదర్శి, కల్పిక, షియాజి షిండే, యానీ, శశాంక్‌, సత్య లాంటి వాళ్ళు ముఖ్య పాత్రలలో నటించారు. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వచించిన ఈ సిరీస్ ని అన్నపూర్ణ స్టూడియోస్‌ వారు దీన్ని నిర్మించారు. ఈ సిరీస్ లో ఒక చోట కృషితో నాస్త్ దుర్భిక్షం అనే క్యాప్షన్ కనిపిస్తుంది. ఇదే పేరుతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమా తెరకెక్కింది. ఈ విషయాన్ని షేర్ చేసిన ప్రియదర్శి, "ఇది పోలిక కానే కాదు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మీ బాటలో నడిచి ఎంతో స్ఫూర్తి పొందా. నటనలో మీరు ఆవిష్కరించిన కొత్త విధానాలు నాపై ఎంత ప్రభావం చూపాయో మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. అందుకే మీ ఏకలవ్య శిష్యుడిగా ఈ లూసర్ మీకు అంకితం" అని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

More Related Stories