అనుష్క సినిమా ఆన్‌లైన్‌లోనే.. అమెజాన్‌లో నిశ్శబ్ధం.. Anushkas Nishabdham
2020-05-17 00:33:13

లాక్‌డౌన్ పుణ్యమా అని ఓటిటి ప్లాట్ ఫామ్స్ పండగ చేసుకుంటున్నాయి. వరసగా కొత్త సినిమాలు నేరుగా అందులోనే విడుదలవుతున్నాయి. ఇప్పటికే అమెజాన్ చాలా వరకు క్రేజీ సినిమాలను కొనేసింది. ఇప్పుడు అనుష్క సినిమాను కూడా అందులోనే విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. లాక్‌డౌన్ సమయంలో ఈమె నటించిన నిశ్శబ్దం సినిమాపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. చాలా రోజులుగా ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై రిలీజ్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దీనిపై కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిశ్శబ్ధం సినిమాను అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు చిత్ర యూనిట్ చెప్తుంది. హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎప్రిల్ 2న విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో మాధవన్, అంజలి, శాలిని పాండే లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. హాలీవుడ్ స్టార్ మ్యాడిన్సన్ విలన్ గా నటించాడు. మొత్తానికి అనుష్క సినిమా ఆన్‌లైన్ రిలీజ్ చేస్తే ఇంకా చాలా సినిమాలు క్యూ కట్టడం ఖాయం. 

More Related Stories