లాక్ డౌన్ ముగియగానే పూజా అక్కడికి వెళ్తుందట !pooja
2020-05-17 17:43:58

ప్రపంచం అంతా ఇప్పుడు సైలెంట్ అయిపొయింది. కరోనా పుణ్యమా అని నిత్యం లేస్తే లైట్స్ యాక్షన్ అనే సౌండ్స్ వినే సినిమా జీవి ఇప్పుడు ఇళ్లకే పరిమితం అయ్యాడు. అయితే వీరంతా సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. కన్నడ భామ పూజాహెగ్డే ఈ విరామ సమయాన్ని తమ కుటుంబ సభ్యులతో గడుపుతోంది. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని అయితే ముందుగా చేయాలనుకుంటున్న విషయాలు ఇవేనని కొన్ని పంచుకుంది ఆమె. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉన్నానన్న పూజ ఈ లాక్‌డౌన్‌ టైంలో వంట ప్రావీణ్యాన్ని ప్రదర్శించే అవకాశం దక్కిందని చెప్పుకొచ్చింది. ఇక మంగళూరులో ఉండే మా అమ్మమ్మను కలుసుకొని చాలా రోజులైందని లాక్‌ డౌన్‌ తొలగిపోగానే ముందు అమ్మమ్మవాళ్ల ఇంటికెళ్ళి అక్కడ తన బెస్ట్ ఫెండ్స్ ని కలుస్తానని చెప్పుకొచ్చింది. అంతేకాక ప్రభాస్‌తో చేస్తున్న  సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది కాబట్టి హైదరాబాద్‌ కు కూడా వెళ్లాలని చెప్పుకొచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా షూట్ మధ్యలో ఆపేశారని వెళ్లి ఆ షూటింగ్‌లో జాయిన్‌ అవ్వాలని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కాస్త బ్రేక్ తీసుకొని నాకు ఇష్టమైన కేరళలోని బేకల్‌ కు వెళ్తానని గత ఏడాది అక్కడికు వెళ్లినప్పుడు ప్రకృతి సౌందర్యం నన్ను ముగ్ధురాలిని చేసి, మనసంతా ప్రశాంతంగా మారిపోయిందని ఆమె చెప్పుకొచ్చింది. మళ్లీ ఆ అనుభూతుల్ని తిరిగి పొందాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.  

 

More Related Stories