ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా వెనక అసలు కథ అదా.. Jr NTR
2020-05-20 15:57:59

ఇండ‌స్ట్రీలో ఓ క‌థ ఓ హీరోకు న‌చ్చుతుంది.. మ‌రో హీరోకు న‌చ్చ‌దు. అలా వ‌ద్ద‌నుకున్న క‌థ‌లే త‌ర్వాత సూప‌ర్ హిట్స్ అవుతుంటాయి.. ఒక్కోసారి డిజాస్ట‌ర్స్ కూడా అవుతుంటాయి. మిస్ అయిన సినిమా హిట్ అయితే బాధ ప‌డ‌తారు.. ఫ్లాప్ అయితే బ‌తికిపోయాం అనుకుంటారు. ఇప్పుడు మ‌హేష్ బాబు కూడా ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ చెప్పిన క‌థ‌ను కాద‌నుకున్నాడ‌ని తెలుస్తుంది. ఆ మ‌ధ్య సుకుమార్ సినిమాను వ‌ద్ద‌నుకుని ఈ మధ్యే అనిల్ రావిపూడితో స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా చేసాడు ఈయ‌న‌. ఈ చిత్రం మంచి విజయం సాధించింది కూడా. ఇదిలా ఉండ‌గానే ఇప్పుడు మ‌రో సినిమాకు కూడా ఈయ‌న నో చెప్పిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. కేజీయ‌ఫ్ తో సౌత్ ఇండ‌స్ట్రీని షేక్ చేసిన ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ చాలా రోజులుగా తెలుగు ఇండ‌స్ట్రీకి రావాల‌ని చూస్తున్నాడు. పైగా ఇక్క‌డ మైత్రి మూవీ మేక‌ర్స్ ఆయ‌న‌తో సినిమా చేయ‌డానికి ఒప్పుకుంది కూడా.దీనిపై అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ వ‌చ్చింది. 

ఇదిలా ఉంటే మ‌హేష్ బాబు కోసం రాసుకున్న క‌థ ఆయ‌న‌కు పెద్ద‌గా న‌చ్చ‌లేద‌ని తెలుస్తుంది. దాంతో ఇదే క‌థ‌ను కాస్త మార్చి జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు చెప్పాడ‌ని.. ఆయ‌న పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకే ప్రశాంత్ నీల్ కూడా జూనియర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను కన్ఫర్మ్ చేసాడు. ఈయ‌న కేజీయ‌ఫ్ 2.. ఆయ‌న రాజ‌మౌళి సినిమా పూర్తైన త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేయ‌బోతున్నార‌ు. మధ్యలో త్రివిక్రమ్ సినిమా కూడా ఉంది. ఇప్ప‌టికే మైత్రి మూవీ మేక‌ర్స్ లో జ‌న‌తా గ్యారేజ్ సినిమా చేసాడు జూనియ‌ర్ ఎన్టీఆర్. ఇప్పుడు మ‌రోసారి క‌లిసి ప‌ని చేయ‌బోతున్నారు. మ‌హేష్ బాబు ఈ క‌థ‌ను వ‌ద్ద‌నుకోడానికి కార‌ణాలు కూడా ఉన్నాయి. ఎస్ జే సూర్య‌, మురుగ‌దాస్ లాంటి అర‌వ ద‌ర్శ‌కులు ఈయ‌న్ని స‌రిగ్గా అర్థం చేసుకోలేదు. పైగా ఇప్పుడు ప్ర‌శాంత్ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు. అందుకే ప‌ర‌భాషా ద‌ర్శ‌కుల కంటే మ‌న ద‌ర్శ‌కులే బెట‌ర్ అనుకుంటున్నాడు ఈయ‌న‌.

More Related Stories