రానా నిశ్చితార్థాన్ని కూడా టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి..rana
2020-05-21 02:40:26

దగ్గుబాటి కుటుంబాన్ని ఇప్పట్నుంచి కాదు చాలా రోజులుగా వదిలిపెట్టడం లేదు శ్రీ రెడ్డి. ఓ రకంగా చెప్పాలంటే దెయ్యం పట్టినట్లు పట్టుకుంది మా అభిమాన హీరో కుటుంబాన్ని అంటూ ఫ్యాన్స్ కూడా ఈమెపై ఫైర్ అయ్యారు. అప్పట్లో దగ్గుబాటి చిన్న వారసుడు అభిరామ్ తనతో రాసలీలలు నడిపాడని.. ఇద్దరి మధ్య అన్నీ అయిపోయాయంటూ చాలా బాహాటంగా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అప్పట్నుంచి కూడా ఈమె దగ్గుబాటి కుటుంబంపై కామెంట్స్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా సురేష్ బాబును అయితే మామా అని పిలవడం కూడా మొదలు పెట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు రానా దగ్గుబాటి నిశ్చితార్థంపై కూడా శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్ చేస్తుంది. రానా బావాకు ఎంగేజ్ మెంట్ ఈ రోజే.. రామానాయుడు స్టూడియోలో నెక్ట్స్ నాదే అంటూ ఆమె పోస్ట్ చేసింది.

ఈమె చేసిన వ్యాఖ్యలు చూసి అభిమానులు నువ్వు ఇంక జీవితంలో మారవు కదా అంటూ ఫైర్ అవుతున్నారు. మొన్నటికి మొన్న కూడా పెళ్లిపై కామెంట్ చేసింది శ్రీ రెడ్డి. రానా నీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలుసు.. ఇకపై ఈ అమ్మాయితో అయినా నువ్వు సంతోషంగా ఉండాలంటూ కోరుకుంటున్నానని పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. పెళ్లికి కంగ్రాట్స్ చెప్పడం ఓ పద్దతి.. కానీ గిల్లి నెయ్యి రాసినట్లుంది శ్రీ రెడ్డి చెప్పిన విషెస్. నీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలుసు అంటూ లేనిపోని అనుమానాలకు తావిచ్చింది ఈమె. దాంతో అసలేం జరిగిందబ్బా అంటూ ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఇప్పుడు మరోసారి రానా బావా అంటూ సెటైర్లు వేసింది ఈమె. ఏదేమైనా కూడా ఈ శ్రీ రెడ్డి చేసే అల్లరి మాత్రం మామూలుగా ఉండదు కదా.. ఎప్పుడూ ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇలాంటి ఫిట్టింగే పెట్టింది అంటున్నారు నెటిజన్లు.

More Related Stories