చావక ముందే చంపేయకండి.. పాకిస్తాన్ నటి సీరియస్..actress
2020-05-24 02:18:08

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంచలనం రేపింది. ఈ ప్రమాదంలో ఏకంగా 100 మందికి పైగానే చనిపోయారని అంచనా వేస్తున్నారు. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల మధ్యలో కూలిగిపోయింది విమానం. అందులో 98 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్ పోర్ట్ సమీపంలోని పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం కూలిపోయింది. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది.  ప్రమాదం జరిగే సమయంలో విమానంలో 90 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. మొత్తంగా 107 మంది చనిపోయారని ప్రచారం జరుగుతుంది. జనావాసాల మధ్య ఈ విమానం కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో పాకిస్తాన్ నటి అయేజా ఖాన్ కూడా చనిపోయిందని వార్తలు వచ్చాయి. ఆమెతో పాటు అయేజా భర్త కూడా చనిపోయాడని పాక్ ఛానెల్స్ కూడా ప్రసారం చేసాయి. దాంతో ఈమె వెంటనే సోషల్ మీడియాలో రియాక్ట్ అయింది. చచ్చిపోక ముందే చంపేస్తున్నారు.. కాస్త వాస్తవాలను తెలుసుకుని ప్రచారం చేస్తే మంచిది అంటూ సీరియస్ అయింది. తనకేం కాలేదని.. తన భర్త కూడా క్షేమంగానే ఉన్నాడని చెప్పుకొచ్చింది అయేజా ఖాన్. దాంతో ఆమె అభిమానులతో పాటు సన్నిహితులు ఊపిరి పీల్చుకున్నారు.

 

More Related Stories