అన్నపూర్ణ ఆటాకు చిరంజీవి చిన్నకూతురు ప్రమోషన్..kalyan dev sreeja
2020-05-25 21:39:25

లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండిపోయిన చిరంజీవి చిన్నకూతురు శ్రీజ.. ఇప్పుడు తన భర్త కళ్యాణ్ తో కలిసి అన్నపూర్ణ గోధుమ పిండికి ప్రమోషన్ చేస్తుంది. ఈ ఇద్దరూ బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు. ఇంట్లోనే ఉండి ఆటకు కావాల్సిన ప్రమోషన్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన వీడియో చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. లాక్‌డౌన్ సమయంలోనే ఎప్పుడూ వంటలు చేయని మగవాళ్లు.. కొన్ని రోజులుగా చేస్తున్నారు. అయితే వాళ్లు చేస్తున్నవి కొన్ని షేప్ లేకుండా కూడా వస్తున్నాయి. వాటికి విచిత్రమైన పేర్లు కూడా పెడుతూ జోకులు వేస్తున్నారు సెలబ్రిటీస్. ఈ క్రమంలోనే చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా ఇంట్లోనే ఉండి భార్యకు ప్రేమలో చపాతీలు చేసాడు.

అయితే అవి ఒక్కటి కూడా రౌండ్ గా రాలేదు. ఒకటి ఆఫ్రికా.. మరొకటి ఆస్ట్రేలియా.. ఇంకొకటి ఇండియా షేపుల వచ్చేసాయి. దాంతో శ్రీజ కూడా వాటిని చూసి సెటైర్లు వేస్తుంది. ఇదిలా ఉంటే అసలు చపాతీలు అనేవి రౌండ్ గానే ఎందుకుండాలి.. టేస్టుగా ఉంటే సరిపోతుంది కదా అంటూ కళ్యాణ్ అడగడం.. దానికి శ్రీజ కూడా ఔనని చెప్పడం ఈ వీడియోలో ఉంది. మీరు కూడా ఇలాంటి ఫన్నీ చపాతీలు చేస్తే మాకు షేర్ చేయండి.. అందులో బెస్ట్ ఎంపిక చేసి తమ వాల్ లో పోస్ట్ చేస్తామని చెప్పారు ఈ మెగా జంట. చివర్లో కచ్చితంగా అన్నపూర్ణ ఆటను కూడా ట్యాగ్ చేయాలని చెప్పారు. మొత్తానికి ఇంట్లోనే ఉండి అలా ప్రమోషన్ చేసుకుంటున్నారన్నమాట. 

More Related Stories