కరణ్ జోహార్‌ను కలవరపెడుతున్న కరోనా వైరస్..karan
2020-05-27 20:15:13

కరోనా వైరస్ కు చిన్నా పెద్ద అనే తేడా లేదు. ఇప్పటికే ముంబైతో పాటు మహారాష్ట్రను వణికిస్తుంది కరోనా. రోజుకు వేలల్లో కేసులు వస్తున్నాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇంట్లో పని చేసే సిబ్బందిలో ఇద్దరికి కరోనా వైరస్‌ వచ్చింది. ఇదే విషయాన్ని కరణ్‌ జోహార్‌ మీడియాతో వెల్లడించాడు. తమ ఇంటి సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని.. వెంటనే తమ ఇంట్లోని ఓ ప్రత్యేక గదిలో వాళ్లను ఉంచి సంబంధిత అధికారులకు సమాచారం అందించామని తెలిపాడు కరణ్. ఆ తర్వాత తమ కుటుంబ సభ్యులతో పాటు ఇతర సిబ్బంది కూడా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పాడు.

భగవంతుడి దయ వల్ల అందరికీ నెగటివ్‌ వచ్చిందని తెలిపాడు ఈయన. అయినా కూడా రిస్క్ తీసుకోకుండా 14 రోజుల పాటు సెల్ఫ్‌ ఐసొలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు ఈయన. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని.. అలాగే కరోనా బారిన పడ్డ తమ సిబ్బంది బాగోగులను చూసుకుంటానని హామీ ఇచ్చాడు కరణ్ జోహార్. వాళ్లు త్వరలోనే కోలుకుంటారన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేసాడు కరణ్. కరోనా బారిన పడకుండా అంతా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇంట్లోనే ఉండి సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనాను ఓడించే సత్తా మనకుందని గుర్తు చేసాడు ఈయన.

 

More Related Stories