కరోనా వైరస్ నుంచి కోలుకున్న ప్రముఖ నటుడు..kiran
2020-05-28 07:52:50

ఇండియాను ప్రస్తుతం కరోనా వైరస్ కుదిపేస్తుంది. ఈ మాట కూడా తక్కువేనేమో.. ఎందుకంటే వణికిస్తుంది.. భయంతో చంపేస్తుంది. ఒక్కటి రెండు కాదు.. ఇప్పటికే 1.5 లక్షల మంది దీని బారిన పడ్డారు. రోజుకు కనీసం 5 వేలకు పైగానే కేసులు కూడా నమోదవుతున్నాయి. సెలబ్రిటీస్ కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ మధ్యే బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కరోనా బారిన పడిన సంగతి అందరికీ తెలుసు. ఆ తర్వాత బాలీవుడ్ లో మరో ఇద్దరు ముగ్గురు దర్శక నిర్మాతలు కూడా కోవిడ్ 19 బారిన పడ్డారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖ నటుడు కిరణ్ కుమార్ కు కూడా కరోనా వైరస్ సోకింది.
దాదాపు 500 సినిమాలకు పైగా నటించిన ఈయనకు అక్కడ మంచి గుర్తింపు ఉంది. కిరణ్ కుమార్ కు కరోనా సోకిన సంగతి క్షణాల్లోనే అంతా వైరల్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈయన వైరస్ నుంచి కోలుకుని మామూలు మనిషి అయ్యాడు. వైరస్ పాజిటివ్ వచ్చిన వెంటనే కొన్ని రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచారు వైద్యులు. ఇప్పుడు ఆయనకు చేసిన టెస్ట్ లో కరోనా నెగిటివ్ వచ్చినట్టు తేలింది. దీనితో ఆయన కరోనా బారి నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈయన సీరియల్స్ చేస్తూ బిజీ అయిపోయాడు.

More Related Stories