వాక్సిన్ వచ్చేస్తుంది అంటూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన ప్రశాంత్ వర్మ Prasanth Varma
2020-05-29 17:21:37

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన మూడవ చిత్రం ప్రీ-లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ అతని పుట్టినరోజు సందర్భంగా కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ప్రీ లుక్ అలానే మోషన్ పోస్టర్లు ఘోరమైన మొసలి లాంటి ఒక దాని నోట్లోన్ నుండి కర్నూలు కొండారెడ్డి బురుజును చూపిస్తున్నట్టు ఉంది. అలానే ఈ పోస్టర్ లో CORONA WAS JUST THE BEGINNING…అంటూ పేర్కొన్నారు. నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న మొదటి కరోనా చిత్రంగా అని పేర్కొన్న ప్రశాంత్ వర్మ యొక్క మూడవ చిత్రం లాక్డౌన్ అమలుకు ముందే 40% షూట్ జరిగిపోయిందని పేర్కొన్నారు. ఇక  ఈ మోషన్ పోస్టర్ లో కొండారెడ్డి బురుజు ముందు జనాలు పడిపోయి చనిపోతున్న విషయాన్ని చూపించారు. అంటే బహుశా దీనిని కర్నూల్ నేపధ్యంలో తెరకెక్కించి ఉండచ్చని అంటున్నారు. అయితే చాలా మంది ఈ సినిమా ఆ కి సీక్వెల్ అని ప్రచారం చేస్తుండడంతో ఆయన నిన్న క్లారిటీ ఇచ్చారు. తాను చేస్తున్న ఈ సినిమా కరోనా వైరస్ కు సంబంధించిందని ఆకు సీక్వెల్ కాదని పేర్కొన్నారు. తెలుగు స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడని జానర్ లో ఈ సినిమా ఉండబోతుద్నని ఆయన పేర్కొన్నారు. 

More Related Stories