త్రివిక్రమ్ మళ్లీ సమంత దగ్గరికే వస్తున్నాడా.. samantha
2020-05-30 02:45:19

ఒక్కో దర్శకుడికి ఒక్కో హీరోయిన్ బాగా కనెక్ట్ అవుతుంటుంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సమంతకు బాగా కనెక్ట్ అయిపోయాడు. ఆమె పెళ్లికి ముందు వరసగా మూడు సినిమాలు చేసాడు. అత్తారింటికి దారేది సినిమాతో మొదలైన వీళ్ల జర్నీ అ..ఆ, సన్నాఫ్ సత్యమూర్తి సినిమా వరకు సాగింది. ఈ మూడు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఆ తర్వాత పూజా హెగ్డేతో జర్నీ మొదలు పెట్టాడు మాటల మాంత్రికుడు. అయితే ఇప్పుడు మరోసారి సమంతను తన సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈయన ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. తారక్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ పూర్తి కాగానే త్రివిక్రమ్ సినిమా మొదలు కానుంది.

ట్రిపుల్ ఆర్ కరోనా కారణంగా రెండు నెలలుగా ఆగిపోయింది. జూన్ మొదటి వారం నుంచి షూటింగ్ మొదలు కానుంది. అది పూర్తైన తర్వాత త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కనుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. అయిననూ పోయి రావలే హస్తినకు అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా సమంత నటించబోతుందని తెలుస్తుంది. ఈమెతో పాటు మరో ముద్దుగుమ్మ కూడా నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఎన్టీఆర్ తో కూడా సమంత నాలుగు సినిమాలు చేసింది. బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస, జనతా గ్యారేజ్ సినిమాల్లో కలిసి నటించారు వీళ్లు. తాజాగా ఐదోసారి రొమాన్స్ కు రెడీ అవుతున్నారన్నమాట. 

More Related Stories