పుట్టిన బిడ్డకు సోను సూద్ పేరు పెట్టుకున్న వలస కార్మికురాలు..sonu
2020-05-30 14:35:23

సోను సూద్ అంటే ఇన్నాళ్లూ కేవలం నటుడు మాత్రమే. అందులో విలన్ వేషాలతో ఈయన బాగా పాపులర్ అయ్యాడు. కానీ ప్రస్తుతం సోను సూద్ అంటే రియల్ హీరో. ఈయన చేస్తున్న పనులు చూసి ఆసేతు హిమాచలం ఈయనకు సలాం చేస్తుంది. నువ్వు నిజమైన హీరో అంటూ కీర్తిస్తున్నారు. కొందరు అభిమానులైతే ఏకంగా విగ్రహం పెట్టడానికి రెడీ అయిపోతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన వేలాది మంది వలస కార్మికులను వాళ్ల వాళ్ల స్వస్థలాలకు పంపించడానికి సోను సూద్  చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు దాదాపు పది వేల మంది వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపించాడు ఈయన. అది కూడా తన సొంత ఖర్చులతో ఈ పనులన్నీ చేస్తున్నాడు సోను సూద్.

దీని కోసం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో ఈయన మాట్లాడుతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఒక వలస కార్మికురాలు తనకు పుట్టిన బిడ్డకు సోనూ సూద్ పేరు పెట్టుకుంది. ఈ రోజు మేము బ్రతికే ఉన్నాము అంటే.. ఇలా మా సొంత ఊరికి వచ్చాను అంటే దానికి కారణం సోనూసూద్ గారు.. ఆయన మాకు దేవుడితో సమానం.. అందుకే నాకు పుట్టిన బిడ్డకు సోను సూద్ శ్రీవాత్సవ అని పేరు పెట్టుకున్నాను.. అంటూ ఒక వలస కార్మికురాలు చెప్పుకొచ్చింది. ఇది చూసి సోను ఎమోషనల్ అయిపోయాడు.. కన్నీరు పెట్టుకున్నాడు ఒక మనిషిగా తనకు ఇంతకంటే ఏం కావాలి అంటున్నాడు ఈయన. నిజంగానే ఇప్పుడు సోను సూద్ చేస్తున్న పనులు చూసి అందరూ ఆయనకు దండం పెడుతున్నారు.

More Related Stories