నేను మోనార్క్ అంటున్న బాలయ్య Balakrishna
2020-05-30 09:14:38

డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నిజానికి అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరిలోనే సెట్స్‌ పైకి వెళ్ళాల్సి ఉంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 26 నుంచి జరగనుందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఏమయిందో ఏమో కానీ ఈ సినిమా షూటింగ్ లేట్ గా మార్చ్ నెల మొదట్లో మొదలయింది. 

ఆ మొదటి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోండగా కరోనా కాటు వేసింది. అయితే ఈ సినిమా కధ ప్రకారం వారణాసిలో కూడా షూట్ చేయాల్సి ఉంది. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో నటిస్తారని ఒక పాత్ర అఘోరా పాత్ర అని మరో పాత్ర నార్మల్ పాత్ర అని స్వయంగా బోయపాటే ఈ మధ్యన ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ సినిమాలో ఆయనకు సోదరుడిగా నటించేందుకు సందీప్‌ మాధవ్‌ (సాండీ)ని తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు, అది కాక ఈ సినిమాలో హీరోయిన్ ఈమె అంటూ కొందరు పేర్లు ప్రచారం జరిగాయి వాటి మీద కూడా క్లారిటీ లేదు.

అయితే కానీ ఇప్పుడు బాలయ్య సినిమాకు సంబందించిన ఒక ఆసక్తికర అప్డేట్ వచ్చింది. అదేంటంటే బాలయ్య సినిమా పేరు, ఈ సినిమా సినిమా టైటిల్‌పై ఎన్నో ఉహాగానాలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాకి ‘మోనార్క్’ అనే చిత్ర టైటిల్‌ని ఫిల్మ్ ఛాంబర్లో నమోదు చేశారని సినీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో ఆ రోజునే ఈ సినిమా టైటిల్ అధికారికంగా ప్రకటించనున్నారని  చెప్పుకుంటున్నారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మితమయ్యే ఈసినిమాకి మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు.  చూడాలి ఈ సినిమాతో అయినా బాలయ్య హిట్ కొట్టి మళ్ళీ ట్రాక్ లో పడతారేమో !

More Related Stories