కేజీఎఫ్ దర్శకుడితో ఎన్టీఆర్ పీరియాడిక్ డ్రామా Jr NTR
2020-05-30 16:34:19

తెలుగు డైరెక్టర్ కాకపోయినా ఇప్పుడు తెలుగు వాళ్ళు ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన తీసిన మొదటి సినిమానే సూపర్ కాదు బంపర్ హిట్ కావడంతో మన తెలుగు హీరోల అభిమానులు మా వాడితో కూడా ఒక సినిమా చేస్తే బాగుండు అనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్ధం అయ్యే ఉంటుంది. అవును ఆయనే ప్రశాంత్ నీల్. కన్నడ కేజీఎఫ్ ని తెరకెక్కించిన దర్శకుడు. కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. 

మొదటి భాగం హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ దర్శకుడు ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే అది త్రివిక్రమ్ తో చేసే సినిమా తరువాత ఉంటుందని చెప్పచ్చు. పాన్‌ ఇండియా లెవల్ లో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ దీన్ని నిర్మించబోతుంది. అయితే ఈ కధకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. 

అదేంటంటే ఈ సినిమాని కూడా పీరియాడిక్‌ డ్రామాగానే తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇంకా ఈ స్క్రిప్ట్ రెడీ కాలేదని కెజిఎఫ్‌ 2 పోస్ట్ ప్రొడక్షన్  పూర్తి కాగానే ఎన్టీఆర్‌ సినిమా స్క్రిప్ట్‌ పనిని ప్రారంభించనున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ వంటి పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా అదే జానర్ లో తెరకెక్కించనున్నారని అంటున్నారు. త్రివిక్రమ్ తో మూవీ పూర్తి అయిన వెంటనే ఆయన కెజిఫ్ డైరెక్ట్ ప్రశాంత్ నీల్ సినిమాలో జాయిన్ అవుతారని అంటున్నారు. 2021 చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ రెండేళ్ల పాటు బల్క్ డేట్స్ ఇవ్వనున్నట్టు చెబుతున్నారు.

More Related Stories