మళ్ళీ నాగబాబు సంచలన ట్వీట్స్...పిచ్చికుక్క అంటూ Nagababu
2020-05-30 23:35:47

నాగబాబు మరోసారి సంచలన ట్వీట్స్‌ చేశారు. పిచ్చికుక్కలతో డీల్ చేయడం చాలా ప్రమాదకరమన్నారు. . పిచ్చికుక్కలను బంధించాలి...లేదంటే మత్తు మందు ఇవ్వాలి... కానీ వాటిని అలా వదిలేస్తే ప్రమాదమంటూ ట్వీట్ చేశారు. హీరో బాలకృష్టతో వార్ నడుస్తున్న సమయంలో నాగబాబు చేసిన ఈ ట్వీట్స్‌ సంచలనంగా మారాయి. భవిష్యత్తులో టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు నాగబాబు. వైసీపీ వస్తుందో... జేఎస్‌పీ వస్తుందో... బీజేపీ వస్తుందో... కానీ కచ్చితంగా టీడీపీ మాత్రం అధికారంలోకి రాదంటూ మరో ట్వీట్ చేశారు నాగబాబు.... టీడీపీ హయాంలో ఏపీ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధి మొత్తం టీవీల్లో పేపర్లోనే కనిపించిందన్నారు. ఘోరంగా ఓడిపోయామన్న విషయం  ఇప్పటికైనా టీడీపీ వాళ్లు గుర్తించాలని ట్వీట్ చేశారు నాగబాబు. ఇంకా తమకు భవిష్యత్తు ఉందని ఆపార్టీ నేతలు భ్రమల్లో బతికితే వాళ్లిష్టమంటూ ట్వీట్ చేశారు నాగబాబు.

More Related Stories