మా ఆయనతో ఉండలేనంటూ సోనూకు మహిళ రిక్వెస్ట్...ట్రిప్ ఆఫర్ చేసిన సోనూ Sonu Sood
2020-06-02 14:57:46

ప్రముఖ బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా మారాడు. ఎందుకంటే తెర మీద విలన్ వేషాలు వేసే ఈ నటుడు క‌రోనా కాలంలో ఇబ్బందులు ప‌డుతున్న వ‌ల‌స కార్మికుల‌ని ఆదుకునేందుకు సొంత ఖ‌ర్చుతో రైళ్ళు, ఫ్లైట్స్ ఏర్పాటు చేసి వారిని సొంత రాష్ట్రాల‌కి త‌ర‌లిస్తూ ఎంతో మంది మన్ననలను అందుకుంటున్నారు. అయితే ఆయన సేవ చూసి చాలా మంది మెచ్చుకుంటుంటే కొందరు మాత్రం ఆయనను టెస్ట్ చేయాలనో ఏమో కానీ పిచ్చి పిచ్చి కోరికలు కోరుతున్నారు. ఇటీవ‌ల ఓ వ్య‌క్తిని త‌న‌ని ఇంటి నుండి వైన్ షాపుకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేయమని కోర‌గా, దానికి సోనూ దిమ్మ తిరిగే స‌మాధానం ఇచ్చి నోరు మూయించారు. ఇప్పుడు తాజాగా ఓ మ‌హిళ తాను ఈ కర్ఫ్యూ మొదలయిన నాటి నుండి భర్తతోనే ఉంటున్నానని తను అతనితో ఇక ఉండలేనని అతనిని అయినా ఎక్కడికయినా పంపాలని లేదా తనను అయినా మా అమ్మగారింటికి పంపాలని కోరుతూ ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన సోనూ ఇదంతా కాదు కానీ నా ద‌గ్గర మరో ప్లాన్ ఉంది. ఇద్ద‌రిని గోవాకి పంపుతాను. ఏమంటారు అంటూ ట్వీట్ చేశాడు. దీంతో సోనూ సమయస్పూర్తితో పాటు విడిపోవాల‌నుకున్న వారిని క‌లిపేందుకు చూపిన చొరవ మీద నెటిజ‌న్లు ప్రశంస‌లు కురిపిస్తున్నారు.

More Related Stories