జొన్న విత్తుల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుJonnavithula
2020-06-02 12:27:26

ఈ మధ్య కాలంలో సినీ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు వివాదాలతో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. మొన్నటికి మొన్న ఏకంగా వర్మతో గొడవ పెట్టుకుని హైలైట్ అయిన ఆయన ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కున్నారు. సోషల్ మీడియాలో దళితుల మనోభావాలను కించపరిచేలా పద్యం పాడిన ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని తెలియజేస్తూ ఆయన ఒక పద్యం పాడారు. అయితే అది అంతరాని తనాన్ని కొనసాగించేలా ఉందని చెబుతూ మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాం ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నాంపల్లి పోలీసులు సోమవారం నాడు జొన్న విత్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి రోజునే ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో న్యాయ నిపుణుల సలహాల మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నామని పోలీసులు చెబుతున్నారు.

More Related Stories