చరణ్ మిస్సయిన సినిమా చేయనున్న శర్వా Sharwanand
2020-06-04 18:50:02

టాలీవుడ్ లో ఉన్న కుర్ర హీరోలలో శర్వానంద్ ఒకరు. ఈయన మినిమం గ్యారెంటీ హీరో కావడంతో ఆయనతో సినిమా చేయడానికి నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆయనకు సరయిన హిట్స్ ఏవీ పడలేదు. మహానుభావుడు సినిమా తర్వాత ఆయన 'పడి పడి లేచే మనసు' 'రణ రంగం' 'జాను' సినిమాలు చేసినా అవేవీ చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో తదుపరి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో సినిమా చేస్తున్నారు. ఇప్పుడు 'శ్రీకారం' అనే సినిమా చేస్తున్నాడు ఈ చిత్రానికి కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా 14 రీల్స్ రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కంప్లీట్ అవ్వగా థియేటర్స్ ఓపెన్ అయ్యాక రిలీజ్ చేయనున్నారు. 

అయితే ఈయన భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్న యువీ క్రియేషన్స్ లో శర్వానంద్ మరో సినిమా చేయనున్నాడని అంటున్నారు. ఇప్పటికే యువీ క్రియేషన్స్ బ్యానర్ లో శర్వానంద్ ఇంతకముందు చేసిన 'రన్ రాజా రన్' 'ఎక్సప్రెస్ రాజా' 'మహానుభావుడు' సినిమాలు చేసి మంచి హిట్స్ కొట్టాడు. ఇప్పుడు రామ్‌చరణ్‌ హీరోగా నటించాల్సిన కథతోనే ఈ బ్యానర్ మీద సినిమా చేయనున్నాడని అంటున్నారు. రామ్ చరణ్, శర్వాల స్నేహితుడైన శ్రీరామ్‌ రెడ్డి అనే వ్యక్తి ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ముందు చరణ్ తో సినిమా చేయాలనుకున్నాడట దర్శకుడు. అయితే ఏమైందో ఏమో కానీ, ఇప్పుడీ ప్రాజెక్టు కాస్తా శర్వానంద్‌ చేతుల్లోకి వచ్చిందని అంటున్నారు. ఒక వేళ అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ‘మహా సముద్రం’ తర్వాత శర్వా చెయ్యబోయే ప్రాజెక్టు ఇదే అవ్వచ్చు.

More Related Stories