టాలీవుడ్ సంగీత దర్శకుడికి హార్ట్ ఎటాక్... Shashi Preetham
2020-06-05 18:00:04

టాలీవుడ్ కి చెందిన మ్యూజిక్ కంపోజర్, గాయకుడు, లిరిసిస్ట్ గులాబీ ఫేమ్‌ శశి ప్రీతమ్ కు నిన్న హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ఆయన్ని హుటాహుటిన  బంజారా హిల్స్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కార్డియాలజీ విభాగానికి చెందిన వైద్యులు ఆధ్వర్యంలో ఆయనకి నిన్న యాంజియోప్లాస్టీ శస్త్ర చికిత్స చేయగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. ఈ వార్తను ధృవీకారించిన ఆసుపత్రి వర్గాలు, "శశి ప్రీతమ్ పరిస్థితి విషమంగా ఉందని, రోగ నిర్ధారణ తరువాత, అతను మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (MI) తో బాధపడుతున్నాడని గుర్తించాము", ఆ చికిత్సలో భాగంగానే నిన్న యాంజియోప్లాస్టీ చేశాము, అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉందని వారు చెప్పారు. దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గులాబి (1995) తో శశి ప్రీతమ్ సంగీత దర్శకుడిగా తెరకు పరిచయం అయ్యారు. జెడి చక్రవర్తి మరియు మహేశ్వరి నటించిన ఈ సినిమాని అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ తో కలిసి రామ్ గోపాల్ వర్మ నిర్మించారు. దర్శకుడు మణిశంకర్ స్పై థ్రిల్లర్ ముఖ్బీర్ (2008) చిత్రంతో శశి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 
 

More Related Stories