నాకు పెళ్లా.. మీకెవరు చెప్పారంటున్న మాధవి లత.. Madhavi Latha
2020-06-06 07:05:54

అతిథి సినిమాలో హీరోయిన్ అమృతా రావు స్నేహితురాలి పాత్రలో నటించి.. ఆ తర్వాత నచ్చావులే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన బ్యూటీ మాధవి లత. స్నేహితుడాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా చేసినా ఈమెకు లక్ అయితే కలిసిరాలేదు. దాంతో సినిమాలకు దూరంగానే ఉంటుంది మాధవి. మొన్నామధ్య రాజకీయాల్లోకి వచ్చి బిజేపీ తరఫున పోటీ కూడా చేసింది. కానీ అక్కడ కూడా కాలం కలిసిరాలేదు. ఇప్పుడు ఈమె పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. దానికితోడు త్వరలోనే శుభవార్త చెప్తానంటూ ఈమె పోస్ట్ చేయడంతో అంతా పెళ్లి కుదిరింది అంటూ వైరల్ చేసారు. దీనిపై ఈమె కూడా ఏం మాట్లాడకపోవడంతో నిజంగానే పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వచ్చాయి. 

కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు. తన పెళ్లి ఇప్పట్లో ఉండదని కుండ బద్ధలు కొట్టేసింది మాధవి లత. మీకు పెళ్లంట కదా.. కంగ్రాట్యులేషన్స్ అంటే నాకు పెళ్లా.. ఎవరు చెప్పారు.. మీరేసిన జోక్‌కు కిందపడి నవ్వాలని ఉందంటూ స్నేహితుడికి రిప్లై ఇచ్చింది మాధవి లత. మంచి అబ్బాయిని వెతకండి చేసకుంటానంటూ కామెంట్ చేసింది ఈ హీరోయిన్. అలాంటి వార్తలేం ఇప్పుడు లేవని.. ప్రస్తుతం ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని మాత్రమే చెప్పుకొచ్చింది మాధవి లత. 2021లో పెళ్లి ఉండే అవకాశం ఉంది కానీ ఇప్పుడు మాత్రం లేదని తెగేసి చెప్పింది మాధవి. వార్త వైరల్ కావడంతో నిజమో కాదో కూడా తెలుసుకోకుండా రాసేసారని చెబుతుంది మాధవిలత.
 

More Related Stories