ఆ స్టార్ హీరో టీమ్ లో ఒకరికి కరోనా పాజిటివ్..Prithviraj Sukumaran
2020-06-06 16:11:22

కరోనా వైరస్ మెల్లమెల్లగా సినిమా ఇండస్ట్రీలోకి కూడా వస్తుంది. ఇప్పటికే చాలా మందికి ఈ వైరస్ సోకింది. కొందరు ప్రాణాలు కూడా విడిచారు. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ కరోనా వైరస్ కారణంగానే చనిపోయాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ మలయాళ స్టార్ హీరో  పృథ్వీరాజ్ సుకుమారన్ టీంలో కూడా ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఆడు జీవితం అనే మలయాళ సినిమా కోసం జోర్డాన్ వెళ్ళిన పృథ్వీరాజ్ సుకుమారన్.. టీమ్ తో పాటు ఆయన అక్కడే నెల రోజులకు పైగా చిక్కుకుపోయారు. ఈ మధ్యే కేరళ ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలతో వాళ్లు తిరిగి ఇండియాకు వచ్చారు. వచ్చిన వెంటనే క్వారంటైన్ కి వెళ్లిన ఆయన కరోనా టెస్టులు చేయించుకున్నాడు. 

రిపోర్టులను బట్టి ఆయన నెగిటివ్ అని తేలింది. దాంతో ఊపిరిపీల్చుకున్నారు అభిమానులు. కుటుంబ సభ్యులు కూడా సంతోషంలో మునిగిపోయారు. తనతో పాటు తన టీంలో ఏ ఒక్కరికి కూడా ఈ మహమ్మారి సోకకుండా తన వంతు బాధ్యత తీసుకున్నాడు పృథ్విరాజ్. అయితే ఇప్పుడు చేసిన కరోనా పరీక్షల్లో 58 ఏళ్ల  ఒక వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దాంతో వెంటనే ఆయనను క్వారంటైన్ నుంచి ఐసోలేషన్ కు తరలించారు అధికారులు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని ఆడు జీవితం యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అతడికి ఎలాంటి సాయం కావాలన్నా తాను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ హీరో పృథ్వీరాజ్ కూడా ప్రకటించాడు. త్వరగా వైరస్ నుంచి కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని చెప్పాడు. 

More Related Stories