రాజమౌళి మెగా ప్లాన్.. కొరటాల శివ, త్రివిక్రమ్ సపోర్ట్..Koratala siva
2020-06-07 15:02:08

తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతలకు ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి నిర్మాతల మండలి ఉంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ అంటూ వాళ్లకు ఏ సమస్య వచ్చినా అందులో పరిష్కరిస్తారు.. కూర్చుని మాట్లాడుకుంటారు. దర్శకుల సంఘం కూడా ఉన్నా అది అంత యాక్టివ్ గా లేదు. దాంతో ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి అటువైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తనతో పాటు కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి స్టార్ డైరెక్టర్స్ ని కలుపుకొని వెళ్తున్నాడు రాజమౌళి. అందరూ కూర్చొని ఇండస్ట్రీలోని దర్శకుల సమస్యలను డిస్కస్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే అందులో అందరు దర్శకుల కంటే కూడా కేవలం అగ్ర దర్శకుల సినిమాల గురించి మాత్రమే చర్చకు వస్తున్నాయనేది ప్రధాన విమర్శ. దీనికి బయటి నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు గాని కొరటాల, త్రివిక్రమ్, రాజమౌళి లాంటి వాళ్లు మాత్రం ఒక దర్శకుల సంఘం ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన సినిమాల షూటింగ్స్ విధివిధానాలపై ఇందులో చర్చిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి రాజమౌళి అధ్యక్షతన మిగిలిన దర్శకులు ముందడుగు వేస్తున్నారని తెలుస్తుంది. ఏదేమైనా ఎన్నిరోజులు సినిమాలు తప్ప బయట విషయాలు తెలియని రాజమౌళి.. ఈ లాక్ డౌన్ తర్వాత ఇండస్ట్రీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు. 
 

More Related Stories