ఎన్నారైగా ఎన్టీఆర్... కథ అదేనా..Trivikram NTR
2020-06-10 14:11:03

యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎన్టీఅర్ తదుపరి సినిమా ఉంబోతున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధా కృష్ణ, కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. రకరకాల పేర్లు అయితే వినిపిస్తూ వచ్చాయి కానీ ఎవరి పేరును ఇంకా ఫైనల్ చేయలేదు. ఇక ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌ లో ప్రచారం జరుగుతోంది. 

అదేంటంటే ఈ సినిమాలో యంగ్ &స్టైలిష్ బిజినెస్మ్యాన్ గా ఎన్టీఆర్ కనిపిస్తారని అంటున్నారు. ఇక ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్నారైగా ఆయన కనిపించబోతున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో పుట్టి పెరిగాక ఇండియాకి ఎపుడూ రాని తారక్, మొదటిసారి ఇండియాకి రావాల్సి వస్తుందని అలా రావడానికి కారణం రాజకీయాలు అని అంటున్నారు. అంతేకాక ఈ సినిమా గురించి లేటెస్ట్ గాసిప్ ఏమిటంటే, ఈ సినిమాలో మరో హీరో కీలక పాత్రను పోషించబోతున్నాడట. అయితే ఆ హీరో ఎవరనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక ‘ఎన్టీఆర్‌ 30’ మొదలవుతుంది.  

More Related Stories