చిరంజీవి సర్జా మృతితో అయోమయంలో పడ్డ నిర్మాతలు..Chiranjeevi Sarja
2020-06-10 18:43:10

39 ఏళ్లు.. కేవలం 39 సంవత్సరాల వయసులోనే కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఈయన మరణం యావత్ సినిమా ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ఈయన. ఇంత చిన్న వయసులో చిరంజీవి చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే కన్నడనాట ఈయన బిజీ హీరో. 2020లో ఇప్పటికే మూడు సినిమాలు విడుదల చేశాడు అంటే చిరంజీవి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఉన్నపళంగా ఇప్పుడు ఆయన చనిపోవడంతో ఆయన సినిమాలకు కమిట్ అయిన నిర్మాతల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు సినిమాలు ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్నాయి. 

అందులో మూడు సినిమాలు  షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. మరో మూడు సినిమాలు ఒప్పుకున్నాడు. ఇప్పుడు హఠాత్తుగా ఆయన మరణించడం ఆ నిర్మాతల గుండెలపై గుదిబండలా మారిపోయింది. ఊహించని పరిణామంతో కన్నడ నిర్మాతలు కంటనీరు పెట్టుకుంటున్నారు. కన్నడలో రీమేక్ స్పెషలిస్టుగా చిరంజీవికి మంచి ఇమేజ్ ఉంది. ఆయన చేసిన 20 సినిమాల్లో 14 సినిమాలు రీమేక్ లే. ఇప్పుడు అలాంటి సబ్జెక్టులకు హీరో లేకుండా పోయాడు. ఏదేమైనా కూడా ఇంత చిన్న వయసులో చిరంజీవి కన్ను మూయడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.

More Related Stories