బాలయ్య అమ్మ మొగుడు డైలాగ్ ఆ ఏపి మినిస్టర్ ను ఉద్దేశించిందేనా.. Balakrishna
2020-06-11 17:10:57

తెలుగుదేశం పార్టీని ఎవరైనా విమర్శిస్తే బాలకృష్ణ మళ్లీ నోటితో సమాధానం చెప్పకుండా సినిమాతో సమాధానం చెబుతూ ఉంటాడు. వాళ్లను అనాల్సిన మాటలు సినిమాలో పెట్టి డైలాగులుగా దంచుతుంటాడు బాలకృష్ణ. ఇప్పుడు కూడా మరోసారి ఇదే జరిగింది. తాజాగా బోయపాటి సినిమా ఫస్ట్ రోర్ విడుదలైన సందర్భంలో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ టీజర్ లో ఉన్న డైలాగ్ ఎవరిని ఉద్దేశించి చెప్పింది అనేది మాత్రం ఇప్పుడు వైరల్ అవుతుంది. తెలుగుదేశం పార్టీతో పాటు అందులో కొందరు నాయకులను ఒక ఏపీ మినిస్టర్ ప్రతి విషయంలో అస్తమానం అమ్మ మొగుడు చెప్పాడా అంటూ విమర్శిస్తుంటారు. ఆయనకు మైకు దొరికితే అమ్మ మొగుడు అనే మాట తప్ప మరొకటి రాదు. 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఆయన అనుచరులను.. మిగిలిన నాయకులను కూడా అలాగే సంబోధిస్తూ ఉంటాడు ఆ ఏపీ మంత్రి. ఆయనకు సమాధానం చెప్పడానికి బోయపాటి సినిమాలో బాలకృష్ణ డైలాగ్స్ చెప్పాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీను గారు మీ నాన్న గారు బాగున్నారా అనేదానికి నీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లండి కొడకా అంటూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ వదిలేశాడు టీజర్ లో. ఇది కచ్చితంగా ఆయనకు పంచ్ అంటున్నారు తెలుగుదేశం అభిమానులు. మరి దీనికి సదరు ఏపీ మంత్రి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. 

More Related Stories