షూటింగ్ కి వెళ్తే స్పేస్ లోకి వెళ్ళినట్టు ఉందంటున్న రకుల్..Rakul PPE travel suit
2020-06-12 08:19:36

ఒకటి కాదు రెండు కాదు మూడు నెలలుగా ఇంట్లోనే ఉండిపోయారు అంతా. కరోనా వైరస్ పుణ్యమా అని ఎప్పుడూ బిజీగా ఉండే లైఫ్ కాస్తా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు తయారైపోయింది. అందులో సినిమా వాళ్లు కూడా ఉన్నారు. క్షణం కూడా తీరిక లేకుండా గడిపే వాళ్లందరినీ రోజుల పాటు ఇంట్లోనే పడేసింది కరోనా మహమ్మారి. ఇక ఇప్పుడిప్పుడే తిరిగి మళ్ళీ షూటింగ్స్ మొదలు పెడుతున్నారు దర్శక నిర్మాతలు. ఓవైపు కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తున్న కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని సినిమా షూటింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా దాదాపు వంద రోజుల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ఈమె ప్రస్తుతం బాలీవుడ్ లో అటాక్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళింది రకుల్ ప్రీత్ సింగ్. 

ఇంతకు ముందు అయితే చిరిగిన బట్టలు.. చేతిలో సెల్ ఫోన్.. భుజానికి బ్యాగు వేసుకొని వెళ్లి పోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు.. కరోనా వైరస్ కారణంగా కింది నుంచి పై వరకు గాలి కూడా దూరం అంతగా డ్రెస్ వేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు రకుల్ కూడా ఇదే చేసింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఆమె వేషధారణ చూసిన మీడియా సభ్యులు తమ కెమెరాల్లో బంధించారు. వాళ్లు ఫోటోలు తీస్తున్న విషయం గమనించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇక చాలు అంటూ క్లాస్ కూడా తీసింది. ఫ్లైట్ ఎక్కిన తర్వాత తనకు స్పేస్ లోకి వెళ్లి నట్టు ఉంది అంటూ ట్వీట్ చేసింది రకుల్. చాలా రోజుల తర్వాత సినిమా షూటింగ్ కోసం ఢిల్లీ వెళ్తుండటం ఆనందంగా ఉంది అంటుంది రకుల్ ప్రీత్ సింగ్. అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్స్ చేస్తామంటూ హామీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో నితిన్ సరసన చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో నటిస్తుంది రకుల్. ఇక తమిళనాట కూడా రెండు సినిమాలు లైన్ లో పెట్టింది. 

More Related Stories