శ్యామ్ కే నాయుడు విషయంలో రంగంలోకి టాప్ ప్రొడ్యూసర్స్ Shyam K Naidu
2020-06-12 20:22:41

టాలీవుడ్ ప్రముఖ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె.నాయుడు తమ్ముడు, శ్యామ్ కె నాయుడు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి ఫేం శ్రీ సుధ అనే నటి ఆయన తనను వివాహం చేసుకుంటాన‌ని చెప్పి మోసం చేసాడ‌ని ఎస్ఆర్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌ లో ఫిర్యాదు చేసింది. సుధా ఫిర్యాదు ప్రకారం కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు శ్యామ్‌ ని అదుపులోకి తీసుకుని విచారించి ఆయనను కోర్టులో కూడా హాజరు పరిచారు. అయితే ఈ వ్యవహారాన్ని కోర్టు దాకా వెళ్ళకుండానే సెటిల్ చేసేందుకు శ్యామ్ కుటుంబ సభ్యులు గట్టిగానే ప్రయత్నించారు. వాళ్ళ వల్ల అవ్వకపోవడంతో టాలీవుడ్ లోని ఇద్దరు ప్రముఖ నిర్మాతలు శ్యామ్ కు సహాయం చేయడానికి ఆమె తో మాట్లాడి సెట్ చేశారని వీరి ప్రతిపాదనకు సుధ కూడా సానుకూలంగా స్పందించిందని అయితే ఈలోపు పోలీసులు కేసు కోర్టుకు సబ్ మిట్ చేసేస్తున్నామని ఈ సమయంలో సెటిల్మెంట్ కుదరదని చెప్పినట్టు సమాచారం. 

దాంతో కేసు కోర్టుకు వెళ్లిపోయిందని అంటున్నారు. శ్యామ్ కె నాయుడు కూడా తన అన్న చోటా కే నాయుడు లానే సినిమా ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ గా అనేక సినిమాలకు పని చేశారు. పోకిరి, బిజినెస్ మెన్, కెమెరామెన్ గంగతో రాంబాబు తో పాటు అనేక సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించారు. ఈయన ప్రముఖ దర్శకుడు పూరీకి బాగా సన్నిహితుడు అని చెబుతారు. ఇక ఈయన పేరు అప్పట్లో సంచలనం రేపిన హైదరాబాద్ సినీ డ్రగ్స్ విషయంలో కూడా గట్టిగా వినిపించింది. అప్పట్లో డ్రగ్ సప్లయర్ కెల్విన్ మొబైల్‌లో శ్యామ్ కె నాయుడు మొబైల్ నంబర్‌ను సిట్ అధికారులు గుర్తించారు. దీంతో ఆయనను కూడా రెండు మూడు రోజులు అప్పట్లో సిట్ అధికారులు విచారించారు. 

More Related Stories