కరోనా కొంపముంచింది.. హీరోల రెమ్యునరేషన్ లో భారీ కోత.. Tollywood
2020-06-13 08:06:24


ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల్లో ఒక్క సినిమా విడుదల కావడం కూడా కష్టంగా ఉంది. అందుకే ఏం చేయలేక డిజిటల్ ప్లాట్ ఫామ్ వైపు అడుగులు వేస్తున్నారు కొందరు నిర్మాతలు. లాక్ డౌన్ పుణ్యమా అని వేల కోట్లు నష్టం వచ్చింది ఇండస్ట్రీకి. అన్ని మెరుగుపడిన తర్వాత తిరిగి షూటింగ్ మొదలు పెట్టినా కూడా ఇంతకుముందులా భారీగా ఖర్చు చేయడం మంచిది కాదు అంటున్నారు విశ్లేషకులు. అసలే భారీ నష్టంతో మన నిర్మాతలకు హీరోల రెమ్యునరేషన్ గుదిబండలా మారుతుంది. ఒక్కో హీరో దాదాపు 30 కోట్ల నుంచి 40 కోట్ల మధ్య తీసుకుంటున్నాడు. దాంతో నిర్మాతలు బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ అవుతుంది. ఇంతకుముందు పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు.. దాంతో ఈ విషయం హీరోలు అర్థం చేసుకోవాల్సిందే అంటున్నారు కొందరు నిర్మాతలు. 

అందుకే గతంలో ఇచ్చినట్లు భారీ పారితోషికం ఇవ్వడం కుదరదు.. ఖచ్చితంగా కోత విధించాలని అంటున్నారు. తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు భారీ పారితోషకం తీసుకుంటున్నారు. చిరంజీవి సొంత సినిమాలు చేస్తున్నాడు కాబట్టి రెమ్యూనరేషన్ తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు హీరోల పారితోషికానికి భారీగానే కోత పడేలా కనిపిస్తోంది. ఇప్పటికే దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ అలాంటి నిర్మాతలు ఈ విషయంపై హీరోలతో చర్చిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

More Related Stories