సింగిల్ షెడ్యూల్ షూట్...సంక్రాంతికి రిలీజ్ Nagarjuna
2020-06-17 00:01:44

‘మన్మథుడు 2’ సినిమా లాంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత అక్కినేని నాగార్జున ‘వైల్డ్ డాగ్’ అనే కాప్ ఓరిఎంటెడ్  మూవీకి కమిట్ అయ్యాడు. మహర్షి సినిమాకి రచయితగా పని చేసిన సాల్మన్ అనే వ్యక్తిని ఈ సినిమా సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. విజయ వర్మ అనే ఒక ఎన్ఏఐ ఆఫీసర్ జీవిత కథనే సినిమాగా మలుస్తున్న ఈ సినిమా షూట్ కూడా దాదాపుగా కంప్లీట్ కావొచ్చింది. ఇంతలో కరోనా రావడంతో ఆ సినిమా షూట్ చివర్లో ఆగింది. ఇక ఇప్పుడు నాగ్ ‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ని త్వరలోనే పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. 

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన “సోగ్గాడే చిన్ని నాయనా” 2016లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ మ్యూజికల్ హిట్ గా కూడా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఆయనే సంగీతం అందిస్తుండగా స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసిన కళ్యాణ్ కృష్ణ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశారట. అయితే అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

 ఈ ఏడాది ఉగాది రోజున ‘బంగార్రాజు’ చిత్రాన్ని మొదలు పెట్టడానికి ప్లాన్ చేసినా కరోనా దేబ్బెసింది. అందుకే ఇప్పుడు   అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమాను మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి బంగార్రాజు సినిమాని రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించే అవకాశాలున్నట్టు సమాచారం.  సోగ్గాడే చిన్ని నాయనలో నటించిన రమ్యకృష్ణ మరోసారి ఇందులో నాగ్ సరసన సందడి చేయనుంది. అయితే నాగచైతన్య సరసన కథానాయిక ఎరనేది ఇంకా తెలియదు. 

More Related Stories