సూపర్ స్టార్ కృష్ణకు మహాకవి శ్రీశ్రీ  అవార్డుKrishna
2020-06-17 18:57:00

నటుడు కృష్ణకు మహాకవి శ్రీశ్రీ ఎక్స్ రే అవార్డు వరించింది. ఆయనకు మహాకవి మహాకవి శ్రీశ్రీ ఎక్స్ రే అవార్డు 2020ను అందచేయనున్నట్టు, సుంకర కృష్ణ మెమోరియల్ కళాపరిషత్, కొండపల్లి అధ్యక్ష్యుడు దేవినేని కిషోర్, ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవాసంస్థ, విజయవాడ అధ్యక్ష్యుడు కొల్లూరి ప్రకటించారు. శ్రీశ్రీ 37వ వర్ధంతి సందర్భంగా ఈ అవార్డు ప్రకటించినట్టు వారు పేర్కొన్నారు. సినీ, సాహిత్య రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారిని గుర్తించి  ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవాసంస్థ ఈ అవార్డులను 2016 నుండి అందిస్తున్నారు. ఇక శ్రీశ్రీ తెలుగు పాటకు కావ్య గౌరవం కల్పించిన మహాకవన్న సంగతి తెలిసిందే. తెలుగు పాటకు తొలిసారి జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చిన మహనీయుడని ఆయనకు పేరుంది. ‘‘నేను సైతం ప్రపంచాగ్నికి కవితనొక్కటి ఆహుతిచ్చాను’’ అంటూ సినీకవిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడంటూ విప్లవ గీతాలను తెలుగు ప్రపంచానికి రుచి చూపించిన మహా ప్రస్థాన కవి. 1952లో ప్రారంభమైన ఆయన సినీ గేయ ప్రస్థానం 1982 వరకు నిరాటంకంగా కొనసాగింది. దాదాపు 50 చిత్రాల వరకు ఆయన సినీ సాహిత్యాన్ని అందించారు. తన రచనలతో ఎంతో మందిని చైతన్య పరిచిన ఈ మహా ప్రస్థాన కర్త 1983 జూన్ 15న స్వర్గస్తులైనారు. ఈ ఏడాదితో ఆయన శ్రీశ్రీ 37వ వర్ధంతి జరుగుతోంది.

More Related Stories